నాపేరు మీనాక్షి సీరియల్ నటి చతుర రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

Naa Peru Meenakshi Ashu Reddy :పలు చానల్స్ సీరియల్స్ జనాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నటీనటులు తమ నటనతో బాగా దగ్గరవుతున్నారు. అలాగే నాపేరు మీనాక్షి సీరియల్ ఈటీవీలో చాలాకాలం నుంచి ప్రసారమవుతూ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ లో నటిస్తున్న నటి చతుర తన అందంతో ,అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నెగెటివ్ రోల్స్ తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా చేర్యాల లో జనవరి 29న జన్మించిన చతుర అసలు పేరు అనుష్ రెడ్డి. ఈమెకు ఒక అన్నయ్య, ఓ అక్క ఉన్నారు. అక్క అమూల్య రెడ్డి సీరియల్ నటిగా సుపరిచితురాలు. అనుష్ రెడ్డి ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉంటున్నారు. డిప్లొమా చేస్తున్న సమయంలో ఈటీవీలో స్టార్ మహిళ ప్రోగ్రాంలో అక్క అమూల్య రెడ్డితో కల్సి పాల్గొంది.

ఈ ప్రోగ్రాం అయ్యాక కొన్ని రోజులకే భార్యామణి సీరియల్ లో అక్క అమూల్య రెడ్డితో కల్సి నటించే ఛాన్స్ ను అనుష్ రెడ్డి దక్కించుకుంది. ఈ సీరియల్ లో తమ నటనతో మెప్పించి, గోకులంలో సీత, ఇద్దరమ్మాయిలు, సూర్యవంశం, అష్టాచెమ్మా , కలల రాజకుమారి సీరియల్స్ లో అనుష్ రెడ్డి నటించింది. రాజారాణి అనే తమిళ సీరియల్ లో కూడా ఈమె నటించి, మెప్పించింది. పలు సినిమాల్లో సైడ్ రోల్స్ లో నటించింది.