MoviesTollywood news in telugu

ఈ నటి జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే…అయ్యో పాపం

Telugu character artist roopa lakshmi :సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నవాళ్లు బిజీగానే ఉంటారు. ఏ పాత్ర వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంటె, చేతినిండా సినిమాలే అలాగే తెలుగు చిత్రాలలో హీరో తల్లి పాత్రలలో నటించి సినీ ప్రేక్షకులను బాగా అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో రూప లక్ష్మి ఒకరు. తెలుగులో శ్రీ విష్ణు హీరోగా నటించిన నీది నాది ఒకటే కథ మూవీలో హీరో తల్లి పాత్రలో నటించి కామెడీ డైలాగులతో అదరగొట్టేసింది. సీరియల్స్ లో కూడా చేసింది. అయితే నటి రూప లక్ష్మి తెలుగులో దాదాపుగా 50 కి పైగా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించింది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల సీరియళ్లలో కనిపించడం లేదు.

అయితే తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని నటి రూప లక్ష్మి షేర్ చేసుకుంది. తన పేరెంట్స్ చిన్నప్పుడు వ్యవసాయం కారణంగా నష్టాలు రావడంతో కుటుంబ పోషణ భారమైందని చెప్పుకొచ్చింది. తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మూడవ తరగతి చదువుతున్నప్పుడే తనని దత్తత ఇవ్వడంతో తన జీవితమే మారిపోయిందని తెలిపింది. తనని దత్తత తీసుకున్న తండ్రి బాగానే చూసుకున్నాడని చెప్పింది.

అయితే ఇంట్లో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు మాత్రం తనని తమ కుటుంబ సభ్యురాలిగా అంగీకరించక పోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వివరించింది. తాను అప్పటి వరకు బాగానే చదువుతున్న తను అనుకోకుండా పలు సమస్యలతో విసిగిపోవడంతో స్టడీస్ ముందుకి సాగలేదని రూపలక్ష్మి చెప్పింది. అయితే కొంత కాలం తర్వాత ఇరుగుపొరుగు వాళ్ళు ద్వారా తన నిజమైన తల్లిదండ్రులు వేరే ఉన్నారని తెలియడంతో వారి దగ్గరికి వెళ్లి పోవడంతో ఇటు తన తోడబుట్టిన వాళ్లకి , అటు పెంచుకున్న వాళ్ళకి దగ్గర కాలేకపోయానని భావోద్వేగానికి లోనైంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."