చంద్రముఖి లో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు..
Chandramukhi Child Artist :సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళంలో నటించిన చంద్రముఖి తెలుగులో కూడా రిలీజ్ కావడంతో రెండు చోట్లా ఘనవిజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో లకలక లక అని రజనీ చెప్పే డైలాగ్ ఇప్పటికీ పాపులర్. ఇక ఈ సినిమా చూడాలంటె కొంచెం భయంగానే ఉంటుంది. టివిలో వస్తున్నప్పుడు కూడా సినిమా భయంగానే చూసేవాళ్ళు ఇంకా ఉన్నారు.
2005లో వచ్చిన చంద్రముఖి మూవీలో నయనతార ,జ్యోతిక,ప్రభు,వడివేలు ఇలా చాలామంది నటించారు. పి వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించి, అత్యధిక భాషల్లో అనువాదం కూడా అయింది. మానసిక వైద్యుని పాత్రలో రజనీ నటన సూపర్భ్. ఇక జ్యోతిక నటన హైలెట్. అయితే కొందరు చైల్డ్ ఆర్టిస్టులు కూడా నటించారు.
ఇక అంతింతో అనే సాంగ్ లో ఓ చైల్డ్ ఆర్టిస్టు మనకు కన్పిస్తుంది. అప్పట్లో ముద్దుగా క్యూట్ గా ఉండేది. కానీ ఇప్పుడు హీరోయిన్ లా మారిపోయింది. ఆ చైల్డ్ ఆర్టిస్టు పేరు ప్రకాశిక. ఇప్పుడు ఆమె పెద్దది కావడంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడో పదేళ్ల క్రితం చూసిన ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఈమె హీరోయిన్ గా గానీ, నటిగా గానీ ఎంట్రీ ఇస్తుందా, వేరే రూట్ లో కెరీర్ మలచుకుంటుందో చూడాలి