విచిత్ర కుటుంబం గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?
Vichitra Kutumbam Full Movie :నటరత్న ఎన్టీఆర్, నటశేఖర్ కృష్ణ కాంబినేషన్ లో మూడో చిత్రంగా విచిత్ర కుటుంబం వచ్చింది. అయితే ఇందులో నటభూషణ్ శోభన్ బాబు కూడా ఉన్నారు. ఒక సాంగ్, కొన్ని సన్నివేశాల్లో కనిపించే అతిధి పాత్రలాంటిది శోభన్ పాత్ర. తమిళంలో కథకునిగా, డైరెక్టర్ గా పేరొందిన గోపాలకృష్ణన్ కి తెలుగులో అదే తొలిమూవీ. మొదట అనుకున్న ప్రకారం కృష్ణ నటించే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ యాక్టర్ రోల్ మాత్రమే. అప్పట్లో కథ అవుట్ లైన్ వినేసి ఎన్టీఆర్ ఒకే చేసారు.
సావిత్రి వేసిన పాత్ర తమిళంలో వరలక్ష్మి వేసింది. కృష్ణ, ఎన్టీఆర్, సావిత్రి, విజయనిర్మల మీద తొలిషాట్ తీసాక ఎక్కువ సన్నివేశాలు ఎన్టీఆర్ పై తీశారు. అప్పుడు కథ చెప్పమని ఎన్టీఆర్ అడిగారు. అయితే తమిళ వెర్షన్ పూర్తయి విడుదలవ్వడం అక్కడ ప్లాప్ కావడంతో కథ మార్చాలని ఎన్టీఆర్ సూచించారు. దర్శకుడే కథకుడు కావడంతో ఆయన్ని కూడా మార్చాల్సి వచ్చింది. అప్పటిదాకా తీసినవన్నీ పక్కన పెట్టేసారు.
దర్శకుడు కె ఎస్ ప్రకాశరావు కి డైరెక్షన్ బాధ్యతలు అప్పగించారు. లాయర్ గా ఎన్టీఆర్, ఆవేశపరుడైన తమ్ముడి పాత్రలో కృష్ణ పాత్రలు రూపుదిద్దుకున్నాయి. మారువేషాలు ఇష్టం కనుక రౌడీ వేషం కూడా వేసిన ఎన్టీఆర్ అభినయం సినిమాకు కీలకం. ఆవేశం వస్తే ఎవరినైనా ఎదిరించే పాత్రలో కృష్ణ నటించాడు. విజయనిర్మల జోడీగా నటించింది. కృష్ణ చెల్లెలుగా సంధ్యారాణి వేసింది.వారిద్దరిపై రంగురంగుల పూల సాంగ్ హిట్ అయింది. విలన్ గా నాగభూషణం. ఆస్తికోసం తమ్ముడు శోభన్ బాబు ప్రాణాలు కూడా తీయడానికి వెనుకాడడు. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ కి సాంగ్స్ లేవు. శోభన్ బాబు , షీలాపై షూట్ చేసిన ఆడవే జలకమ్ములాడవే సాంగ్ ఇప్పటికీ పాపులర్. హీరో కృష్ణ కెరీర్ లో మరుపురాని మూవీ. ఈ సినిమా నిర్మాతకు మంచి డబ్బులను తెచ్చిపెట్టింది.