భారీగా పుష్ప మూవీకి రెమ్యునరేషన్స్…ఎన్ని కోట్లో…?

pushpa movie remunerations :స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‌‘పుష్ప’ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ మూవీలో ఇంతకముందు ఎన్నడు చేయని భిన్నమైన క్యారెక్టర్‌లో బన్నీ కనిపించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే పుష్పరాజ్‌గా అవతారమెత్తనున్నాడు. దీంతో సినిమా ఎలా ఉండబోతుందోనని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఏప్రిల్‌ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందే పుష్ప టీజర్‌ను విడుదల చేయగా,భారీ వ్యూస్ అందుకుంటోంది.

మైత్రీ మూవీ మేకర్స్160 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన నటిస్తోంది.‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఫహద్ ఫజల్ విలన్‌ రోల్‌ చేస్తున్నారు. అయితే బన్నీ కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ కావడంతో ఇంకా బడ్జెట్ పెరిగే ఛాన్స్ ఉందన్న మాట విన్పిస్తోంది. ఈ మూవీ కోసం భారీ ఎత్తున సాంకేతిక నిపుణులను,టెక్నీక్స్ ని వాడుతున్నారని టాక్.

రెమ్యునరేషన్స్ రూపంలోనే 100కోట్లు అవుతున్నట్లు టాక్. ఈ సినిమాకు మొదటి నుంచి వస్తున్న టాక్ నేపథ్యంలో ఎంత ఖర్చుకైనా నిర్మాతలు వెనుకాడడం లేదట. ఇక ఒక్క బన్నీకోసమే 35కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్. సుకుమార్ కూడా పాతిక కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్. విలన్ గా చేస్తున్న మలయాళ నటుడు ఫహద్ ఫజల్ కి 5కోట్లు ముట్టజెపుతున్నారట. హీరోయిన్ రష్మికకు రెండు కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీకి కూడా భారీగా రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ఇక లాభాల్లో కూడా షేర్ కూడా హీరో, డైరెక్టర్ కి ఇస్తారట.