MoviesTollywood news in telugu

అఖిల్ తో ఆమె!…ఎవరో తెలుసా ?

Akhil And Kairavi Mehta :అక్కినేని నాగేశ్వరరావు అంటే తెలుగు ఇండస్ట్రీలో ఓ బ్రాండ్ ఇమేజ్. ఆయన వారసుడిగా నాగార్జున ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచి సత్తా చాటాడు. టాలీవుడ్ మన్మథుడిగా నిలిచారు. అయితే ఆయన పెద్ద కొడుకు నాగ చైతన్య హిట్స్ అందుకోగా, చిన్న కొడుకు అఖిల్ మాత్రం ఇంకా హిట్ కొట్టలేదు. మూడు సినిమాలు తీసినా కల్సి రాలేదు. తాజా చిత్రాలతో ఎలా నెట్టుకొస్తాడో చూడాలి. అయితే అఖిల్ తో ఒకామె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో ఎవరామె అనే సెర్చ్ మొదలవడంతో అసలు కథ తెల్సింది. వయసు మీద పడుతున్న వారు మరింత యంగ్‌ గా కనిపించాలంటే వాళ్ళు తీసుకునే ఆహారం కీలకం అవుతాయి. ముఖ్యంగా సినిమా గ్లామర్ ఫీల్డ్ కావడంతో మరింత జాగ్రత్తగా ఉంటూ, ఆహార నియమాలను పాటిస్తారు. ప్రోటీన్స్,న్యూట్రిన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం ఎంత మెుత్తం,ఏ టైంలో తీసుకోవాలి వంటి విషయాల్లో ప్రొఫెషనల్ సూచనలు ఉండాల్సిందే. అందుకే చాలా మంది సెలబ్రెటీలు స్పెషల్ చెఫ్, పోషకహార నిపుణులను అపాయింట్ చేసుకుంటారు. అలా అక్కినేని ఫ్యామిలీకి కైరవి మెహతా అనే ప్రైవేట్ చెఫ్ ఎప్పటి నుంచో పనిచేస్తోంది.

అమల,నాగర్జున, నాగ చైతన్య, సమంత, అఖిల్ ఇలా అందరూ ఇండిస్ట్రీలో ఉన్నారు. వీరి అరోగ్యాలను కంటికి రెప్పలా కైరవి మెహతా చూసుకుంటుంది. డైట్ ప్రిపెర్ చేయడంలో ఈమె ఫ్లాన్స్ చాలా ఢిపరెంట్‌గా ఉంటాయి. రకరకాల వంటలు చేయడంతో పాటు వారికి ఇష్టమైన వంటలను రుచికరంగా కొవ్వు లేకుండా తయారుచేయడంలో ఆమె దిట్ట. అందుకే కైరవి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఆమె కేవలం చెఫ్‌గానే కాకుండా నాగర్జున ఫ్యామీలి మెంబర్స్‌లో ఒకరిగా ఉంటుంది. అమల కూడా తమ కుటుంబ సభ్యురాలుగా చూసుకుంటారు. ఇక ఆమె చేసే వంటలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుంటారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."