MoviesTollywood news in telugu

అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ వెనుక ఎంత కథ జరిగిందో…?

allu Arjun Pushpa Movie :చిరంజీవి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదగడమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేలా నిలిచారు. ఎందరికో సినిమా ఫ్లాట్ ఫార్మ్ నిర్మించారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అల్లు అర్జున్ తన టాలెంట్ తో స్టైలిష్ స్టార్ అయ్యాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా వచ్చిన అల్లు అర్జున్ ఆతర్వాత వరుసగా భిన్నమైన సినిమాలతో తన స్టామినా ఏమిటో చూపిస్తూ వస్తున్నాడు.

ప్రెజెంట్ యూత్ కూడా స్టైల్స్ విషయంలో ఎక్కువగా బన్నీని ఫాలో అయిపోతున్నారంటే మామూలు విషయం కాదు. కమర్షియల్ సినిమాలు చేస్తున్నా అందులో కొత్తదనం చూపించడం బన్నీ స్టైల్. అందుకే మలయాళం,హిందీ ఇండస్ట్రీలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోగలిగాడు. అతని సినిమాలన్నీ ఈ రెండు బాషలలో రిలీజ్ అవుతూ అక్కడి ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీలో చేస్తున్న బన్నీ ఈ సినిమాలో కాస్త నెగెటివ్ షేడ్ గల పాత్రను సైతం చేస్తున్నట్లు టాక్.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు వచ్చేసాయి. పాండ్ ఇండియా లెవెల్లో ఈ సినిమా అన్ని భాషల్లో రాబోతోంది. ఈ మూవీతో దర్శకుడు సుకుమార్ ఓ విధంగా బన్నీని స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చేశాడు. ఎందుకంటే, అందరూ బన్నీని ఐకాన్ స్టార్ అని పిలవాలని కూడా పుష్ప టీజర్ రిలీజ్ సందర్భంగా చెప్పేసాడు. ఐకాన్ స్టార్ అనేది తనకు మరింత గౌరవం, బాద్యత పెంచేస్తుందని బన్నీ కూడా చెప్పడం ద్వారా ఆ బ్రాండ్ నేమ్ కి సార్ధకత చేసుకోవాలని ఉన్నట్లు తెలుస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."