MoviesTollywood news in telugu

బాలీవుడ్ లో రీమేక్ చేసిన మహేష్ బాబు మూవీస్ హిట్టా..? ఫట్టా..?

Mahesh Babu Movies :రాజకుమారుడు మూవీతో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ కృష్ణ న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు ప్రిన్స్ స్థాయి నుంచి తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగాడు. అయితే యితడు న‌టించిన ప‌లు చిత్రాలు హిందీలోకి రీమేక్ కూడా చేసారు. అందులో మొదటిగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఒక్క‌డు మూవీ మహేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ప‌లు అవార్డుల‌ను పొందింది. 2003లో వ‌చ్చిన ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా, ప్ర‌కాశ్ రాజ్ విల‌న్‌గా చేశారు.

ఈ సినిమా తేవ‌ర్ పేరుతో అప్ప‌ట్లో హిందీలో రీమేక్ అయ్యింది. ర‌వీంద్ర‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో అర్జున్ క‌పూర్‌, సోనాక్షి సిన్హా హీరో, హీరోయిన్లుగా , మ‌నోజ్ వాజ్‌పేయి విల‌న్‌గా చేసిన ఈ మూవీ సినిమా బాలీవుడ్‌లో డిజాస్టర్ అయింది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్‌బాబు,త్రిష జంటగా అత‌డు మూవీ తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎన్నో రికార్డులు సృష్టించింది. దీన్ని ఏక్ పేరుతో బాబీ డియోల్, శ్రియా హీరో, హీరోయిన్లుగా బాలీవుడ్‌లోకి రీమేక్ చేయగా డిజాస్టర్ అయింది.

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్‌,ఇలియానా జంటగా తెరెక్కిన పోకిరి సినిమా 200 సెంట‌ర్ల‌లో 100 రోజులు ఆడి స‌రికొత్త రికార్డులు క్రియాట్ చేసింది. మ‌హేష్ స్థాయి ఈ సినిమా ఓరేంజికి తీసుకెళ్లగా, బాలీవుడ్‌లో వాంటెడ్ పేరుతో ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేశారు. అదృష్టవశాత్తూ అక్కడా ఈ సినిమా సూప‌ర్ హిట్ గా నిల్చి, బాలీవుడ్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."