నెంబర్ వన్ కోడలు సీరియల్ సరసు రియల్ లైఫ్…ఎన్ని కోట్ల అస్థి…?

No 1 kodalu serial madhumita :జి తెలుగులో ప్రసారమవుతున్న నెంబర్ వన్ కోడలు సీరియల్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. నటీనటులు తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక ఇందులో హీరోయిన్ సరసు విషయానికి వస్తే, తెలుగురాని అమ్మాయిగా నటిస్తూ చాలామంది అభిమానం సంపాదించుకుంది. ఈమె అసలు పేరు మధుమిత. 1995మార్చి 29న కర్ణాటకలోని చిక్ మంగుళూరులో పుట్టిన ఈమెను మధు, సరసు అని నిక్ నేమ్స్ తో పిలుస్తారు. ఈటింగ్,స్లీపింగ్,ట్రావెలింగ్,డాన్సింగ్ అంటే ఇష్టం.

తండ్రి హిరణయ్య,తల్లి పారిజాత తో పాటు మధుమితకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. బెంగళూరు స్కూల్ లో టెన్త్ వరకూ చదివిన మధుమిత మౌంట్ కర్నెల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. స్కూల్స్ డేస్ నుంచి నాట్యమంటే మక్కువతో భరతనాట్యం నేర్చుకుంది. ఇక నటనపై ఇష్టంతో మొదట మోడలింగ్ లో కి వచ్చి అలరించింది. ఈమెకు హీరో విజయ దేవరకొండ అంటే ఇష్టమట. 50కి పైగా ఆడిషన్స్ కి వెళ్లి వచ్చింది. ఇక బిజినెస్ వైపు వెళ్లాలని భావిస్తున్న తరుణంలో ఓ కన్నడ సీరియల్ లో నెగెటివ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ సీరియల్ ని తెలుగులో కథలో రాజకుమారిగా తీశారు.

రెండవ సీరియల్ శని లో శనిని ఎదిరించే పాత్రలో మధుమిత చేసి, మూడవ సినిమా జై హనుమాన్ లో లక్ష్మీదేవి పాత్రవేసింది. ఇక 2018లో మనసున మనసై సీరియల్ తో తెలుగులో స్టార్ మా ఛానల్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ హీరోయిన్ గా వేసి, మంచి గుర్తింపు సాధించింది. ప్రస్తుతం సరసు పాత్రతో నెంబర్ వన్ కోడలు సీరియల్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకూ 6సీరియల్స్ చేసింది. పారిస్ అంటే ఇష్టమట. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ప్రావిణ్యం ఉంది. నెలకు బాగానే సంపాదిస్తుంది. సొంత కార్లు కూడా ఉన్నాయి. ఆమెకు ఆస్తులు కూడా బాగానే ఉన్నాయట.