Healthhealth tips in telugu

హ్యాండ్ శానిటైజర్ ఎక్కువగా వాడుతున్నారా …ఈ నిజాలను తెలుసుకోండి

Hand sanitizer in Telugu :ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనమందరం పరిశుభ్రతను పాటిస్తూ తరచుగా చేతులను శుభ్రం చేసుకుంటున్నాం. ఆలా చేతులను శుభ్రం చేసుకోవటానికి శానిటైజర్ ని వాడుతున్నాం. శానిటైజర్ ని ఎక్కువగా వాడకూడదు. అలాగే శానిటైజర్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శానిటైజర్ రాసుకున్న వెంటనే వంట చేయటానికి గ్యాస్ వెలిగించకూడదు. ఎందుకంటే మంట పెరిగే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. ప్రస్తుతం మనకు దొరుకుతున్న శానిటైజర్ లలో ఆల్కహాల్ ని ఉపయోగిస్తున్నారు. ఆల్కహాల్ కి మండే గుణం ఉంటుంది అందువల్ల చేతులకు శానిటైజర్ రాసుకున్న పది నిమిషాల తరవాత మాత్రమే గ్యాస్ అంటించటం వంటివి చేయాలి.

శానిటైజర్ చర్మం మీద ప్రభావాన్ని చూపుతుంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మనం వాడే శానిటైజర్ లో 60 నుంచి 70 % ఆల్కహాల్ ఉంటుంది. ఎక్కువ సార్లు చేతులకు శానిటైజర్ రాస్తే చేతులు పొడిగా మారి చర్మంపై ఎరుపు, పగుళ్లు మరియు దురద,బొబ్బలు ,నొప్పికి కారణం అవుతుంది. శానిటైజర్ చేతులకు రాసి 20 సెకన్లు రుద్దిన ఆతర్వాత మాయిశ్చరైజర్ రాయాలి. అప్పుడు చేతులు తేమగా ఉండి మంట,పొడిదనం లేకుండా ఉంటాయి. శానిటైజర్లు క్రిమినాశక ఉత్పత్తులు-అవి చర్మాన్ని క్రిమి సంహారక చేయడానికి రూపొందించబడ్డాయి. వీటిని ఎక్కువగా వాడితే చర్మం బాగా పొడిగా మారుతుంది. సున్నితమైన చర్మ ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. శానిటైజర్‌లో ఉన్న ట్రైక్లోసన్ కూడా హార్మోన్ల సమస్యలను కలిగిస్తుంది. దీనివల్ల బ్యాక్టీరియా దాని యాంటీమైక్రోబయాల్ లక్షణాలకు అనుగుణంగా మారుతుంది, ఇది ఎక్కువ యాంటీబయాటిక్ నిరోధకంగా మారుతుంది. యాంటీబయాటిక్స్‌కు బ్యాక్టీరియా నిరోధకతను పెంచుతుంది. అలాగే రోగనిరోధక పనితీరును కూడా బలహీనపరుస్తుంది.

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ అలెర్జీకి కారణం అవుతుంది. ఎక్కువ సువాసన కలిగిన హ్యాండ్ శానిటైజర్‌ను థాలెట్స్ మరియు పారాబెన్స్ వంటి విష రసాయనాలతో ఉంటాయి. థాలెట్స్ మానవ శరీర అభివృద్ధి మరియు పునరుత్పత్తిని ప్రభావితం చేస్తాయి. పారాబెన్స్ అనేది హార్మోన్ల పనితీరు, సంతానోత్పత్తి, పునరుత్పత్తి అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా శానిటైజర్ వాడటం వలన చేతిపై ఉన్న మంచి బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. సబ్బు మరియు నీరు అందుబాటులో లేనప్పుడు చేతులు లేదా చర్మంపై వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి అంటువ్యాధుల సూక్ష్మజీవుల భారాన్ని తగ్గించడానికి హ్యాండ్ శానిటైజర్స్ మంచి ప్రత్యామ్నాయం. చేతులను శుభ్రం చేసుకోవటానికి సబ్బు మరియు నీరు అందుబాటులో ఉంటే మాత్రం వాటితోనే శుభ్రం చేసుకోండి.