Healthhealth tips in telugu

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా…ఈ జాగ్రత్తలు మీ కోసమే

corona vaccine care : దాదాపుగా సంవత్సరం పైనే మన కంటికి కనిపించకుండా ముప్పతిప్పలు పెడుతున్న కరోనా వైరస్ మళ్లీ వేగంగా విస్తరిస్తోంది. కరోనా వైరస్ కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కరోనా నియంత్రణకు ఎన్నో చర్యలను చేపడుతుంది. ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. చాలామంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో జ్వరం తలనొప్పి ఒంటి నొప్పులు కండరాల నొప్పులు నీరసం వంటి లక్షణాలు కనబడుతున్నాయి. వీటిని అధిగమించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకుంటే శరీరం రిలాక్స్ గా ఉండటమే కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది

కొబ్బరినీళ్లు మజ్జిగ తాజా పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి

అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న వారు మద్యం సేవించకూడదు. మధ్యం తీసుకోవడం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. అంతేకాకుండా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా రోజుకి 8 గంటల నిద్ర అవసరం లేదంటే తీవ్ర అలసట ఆందోళన వస్తాయి

డీ హైడ్రేషన్ సమస్య లేకుండా నీటిని అధికంగా తీసుకోవాలి.