MoviesTollywood news in telugu

కె ఆర్ విజయ కుటుంబం నుంచి ఎంత మంది హీరో.యిన్స్ వచ్చారో తెలుసా ?

K.R.Vijaya Family :ఆ తరం హీరోయిన్లలో కె ఆర్ విజయ ఒకరు. సావిత్రి జమున వంటి వారితో సమానంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఈ నటి అందం అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో పౌరాణిక, జానపద,సాంఘిక సినిమాలలో నటించింది. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో దేవత పాత్ర అంటే ప్రతి ఒక్కరికి కె.ఆర్.విజయ గుర్తుకొస్తుంది ఆమె అంతలా దేవత పాత్రల్లో ఇమిడిపోయింది.

కె ఆర్ విజయ కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్లు గురించి తెలుసుకుందాం ఈ విషయం చాలా మందికి తెలియదు. కె.ఆర్.విజయ చెల్లెలైన కె ఆర్ వత్సల తమిళ కన్నడ తెలుగు సినిమాల్లో నటించింది.అలాగే బుల్లితెరలో ఎన్నో సీరియల్ లలో నటించింది. మరో చెల్లి కె ఆర్ సావిత్రి. మలయాళంలో మంచి నటి అలాగే తమిళ్ లో కూడా ఎన్నో సినిమాలలో నటించింది. ఈమె కుమార్తెలు అనూష మలయాళం లో టాప్ హీరోయిన్. కన్నడలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. రాగసుధ కూడా మలయాళం,కన్నడలో కొన్ని సినిమాలు చేసింది. కె ఆర్ విజయ చెల్లెళ్లను చెల్లెలు కూతుర్లను సినీ రంగానికి తీసుకువచ్చిన తన కూతురిని మాత్రం సినీ రంగానికి దూరంగా పెంచింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."