వెండితెరపై రాముని పాత్రలో మెప్పించిన టాలీవుడ్ హీరోలు
Sri rama navami:మన హిందూ సంప్రదాయంలో రామునికి ఉన్న ప్రత్యేకత వేరు రామావతారంలో కుటుంబ వ్యవస్థ లోని అనుబంధాలు మానవతా విలువలు సంస్కృతి సంప్రదాయాలు ఇలా అన్ని అర్థం అవుతాయి. అలాంటి రామాయణం లోని రాముని పాత్ర ని వేసి మెప్పించిన హీరోలు గురించి తెలుసుకుందాం. రాముని పాత్ర అంటే ప్రతి తెలుగు అభిమాని కి ఎన్టీఆర్ గుర్తుకొస్తారు
మొట్టమొదటిసారిగా రాముని పాత్ర లో 1932 లో విడుదలైన పాదుకా పట్టాభిషేకం సినిమాలో యడవల్లి సూర్యనారాయణ కనిపించారు
ఎన్టీఆర్ సంపూర్ణ రామాయణం సినిమా లో మొదటిసారిగా రాముడిగా నటించి అద్భుతం అనిపించారు రాముడు అంటే ఇలా ఉంటారా అనే రీతిలో నటించి మెప్పించారు. ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేకం రామాంజనేయ యుద్ధం వంటి సినిమాల్లో రాముని పాత్రలు వెళ్తారు
ఎన్టీఆర్ తర్వాత రాముడు గా మెప్పించిన నటుడు హరినాథ్. హరినాథ్ సీతారామ కళ్యాణం శ్రీ రామ కథ అనే సినిమాలో రాముడు గా నటించారు
ఏఎన్ఆర్ శ్రీరామ జననం సినిమా లో రాముడి పాత్రలో మెప్పించారు
కాంతారావు వీరాంజనేయ సినిమాతో పాటు మరి కొన్ని సినిమాలలో రాముడి గా కనిపించారు
శోభన్ బాబు కూడా రాముడు గా నటించి మెప్పించారు సంపూర్ణ రామాయణం సినిమా లో నటించారు
శ్రీరామదాసు సినిమాలో సుమన్ శ్రీరాముని పాత్రలో అలరించారు.
శ్రీకాంత్ ‘దేవుళ్లు’ సినిమాలో రాముడిగా కాసేపు కనిపించి మెప్పించారు.
శ్రీరామరాజ్యం సినిమాలో బాలకృష్ణ నటించి మెప్పించారు.
జూనియర్ ఎన్టీఆర్ఆ యన నటజీవితాన్ని రామాయణం చిత్రంలో రాముడి పాత్రతో ప్రారంభించారు
ప్రభాస్ కూడా ‘ఆదిపురుష్’ సినిమాలో శ్రీరాముడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

