18 సంవత్సరాలు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్… ఎప్పటి నుండి అంటే…?

corona vaccine india :దేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అలాగే హాస్పిటల్లో బెడ్స్ కూడా ఖాళీ లేవు. కరోనా నియంత్రణలో ఉండాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ కొరత తీర్చాలని అలాగే వ్యాక్సిన్ వేయించే విషయంలో వయసు పరిమితి పెట్టకుండా ఉండాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి.

ఇప్పుడు మూడవ విడతలో మే ఫస్ట్ నుంచి 18 సంవత్సరాల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించటానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండియాలో సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది. యువత వల్ల ఇంట్లో ఉన్న పెద్దవారు కరోనా బారిన పడటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేశాయి