MoviesTollywood news in telugu

వకీల్ సాబ్ మూవీ లో Super Women సరళాదేవి ఎవరో తెలుసా?

Vakeel Saab Movie super Woman Sarala Devi :జనసేన పార్టీ పెట్టి సినిమాలకు దూరమై,సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి నటించిన వకీల్ సాబ్ తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. హిందీ పింక్ రీమేక్ గా వచ్చిన ఈ మూవీలో అంజలి, నివేదా థామస్ కూడా కీలక పత్రాలు పోషించారు. లాయర్ పాత్రతో పవన్ కళ్యాణ్ ఆకట్టుకున్నాడు. ఆడియన్స్ ఈ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు.

ఇక ఈ మూవీలో సరళాదేవి సూపర్ ఉమెన్ గా బాగా ఆకట్టుకుంది. ఈమె పూర్తిపేరు లిరిషా కూనపరెడ్డి. 1977జున్ 7న హైదరాబాద్ లో పుట్టిన ఈమె సీరియల్స్ తో ఇండస్ట్రీలోకి వచ్చింది. అమ్మ నా కోడలా, లక్ష్మి సౌభాగ్యవతి వంటి సీరియల్స్ లో నటించింది. ఇక అమ్మ నా కోడలా సీరియల్ అప్పట్లో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.

జి తెలుగులో వస్తున్న అక్కా చెల్లెల్లు, జెమినిలో వస్తున్న లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్స్ లో లిరిషా నటిస్తోంది. స్టాలిన్ మూవీలో సునీల్ ని పెళ్ళిచేసుకొనే అమ్మాయిలా నటించింది. ఇప్పుడు వకీల్ సాబ్ లో సూపర్ వుమెన్ గా పోలీసాఫీసర్ పాత్ర పోషించింది. కోర్టు సీన్ లో సూపర్ ఉమెన్ అని పవన్ సంబోధిస్తారు. ఈ సీన్ చాలా పాపులర్ కావడంతో సూపర్ ఉమెన్ సరళాదేవిగా పిలుస్తున్నారు.