నెంబర్ వన్ కోడలు విలన్ ప్రీతి లైఫ్ స్టైల్…మొదటి పారితోషికం ఎంతో…?

No 1 Kodalu Serial Villan Preethi :బుల్లితెరమీద వస్తున్న సీరియల్స్ కి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. అందుకే చాలామంది నటీనటులు బుల్లితెర మీద నటించి ఆడియన్స్ కి దగ్గరవు తున్నారు. జి తెలుగులో ప్రసారమవుతున్న బిగ్గెస్ట్ సీరియల్ నెంబర్ వన్ కోడలు లో విలన్ పాత్ర లో నటిస్తున్న ప్రీతి అసలు పేరు ఉషా వైభవి. 1994 ఏప్రియల్ 5న కర్ణాటకలోని బెంగళూరులో పుట్టిన ఈమెను ఉషా, వైభవి అని పిలుస్తూ ఉంటారు.

చిన్నతనం నుంచి యాక్టింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. స్టడీస్ అంటే ఇష్టం.ఇక ఏ ఫంక్షన్ అయినా డాన్స్ చేయడం, క్లాస్ మేట్స్ కి డాన్స్ నేర్పించడం చేసేది. స్టడీస్ పూర్తయ్యాక జాబ్ చేస్తుంటే, అనుకోకుండా మూవీలో ఛాన్స్ వచ్చింది. యాక్టింగ్ తెలియక పోవడంతో డైరెక్టర్ చెప్పినట్లు చేసేది. తొలి పారితోషికం 3వేలు అందుకుంది. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. కన్నడంలో దుర్గ అనే సీరియల్ లో మొదటిసారి నటించింది.

లక్ష్మి కళ్యాణం సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన వైభవి అందులో స్వాతి పాత్రతో అలరించింది. ఆ తర్వాత గోరింటాకు సీరియల్ లో నటించింది. తల్లిదండ్రులతో పాటు ఒక బ్రదర్ కూడా వైభవికి ఉన్నారు. 5అడుగుల 7అంగుళాల ఎత్తు, 65కిలోల బరువు గల వైభవి కి కార్స్ కలెక్షన్ ఇష్టం. నటుడు యష్ అంటే ఇష్టం. కన్నడలో కంటే ఈమె తెలుగులో బాగా పాపులర్ అయింది.