MoviesTollywood news in telugu

వెంకటేష్ కెరీర్ లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలుసా?

Hero venkatesh Records : మూవీ మొఘల్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న వెంకటేష్ విక్టరీ కి మారు పేరుగా నిలిచాడు. ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ హిట్స్ కొడుతున్నాడు. పైగా వివాదాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాలతో రాణిస్తున్నాడు. తొలిసినిమా కలియుగ పాండవులు మూవీతో హిట్ అందుకున్న వెంకటేష్ ఇండస్ట్రీలో పలు రికార్డులు క్రియేట్ చేసాడు. విభిన్న పాత్రలకు సంబందించిన సినిమాలు కావడం మరీ విశేషం.

వెంకటేష్, మీనా జంటగా వచ్చిన చంటి మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్. 1992లో వచ్చిన ఈ మూవీ 9కోట్లు గ్రాస్ తెచ్చిన ఈ మూవీ ఆల్ టైం సినిమాగా నిల్చింది. ఎన్టీఆర్ కొండవీటి సింహం రికార్డుని ఈ సినిమా అధిగమించింది. వెంకటేష్,అంజలా జవేరి జంటగా 1997లో వచ్చిన ప్రేమించుకుందాం రా మూవీ 50 సెంటర్స్ లో 100డేస్ ఆడింది. అలాగే సౌందర్యంతో కల్సి నటించిన జయం మనదేరా మూవీ 100సెంటర్స్ లో 100రోజులు ఆడింది.

ఉదయ శంకర్ డైరెక్షన్ లో వెంకటేష్,సిమ్రాన్ జంటగా నటించిన కలిసుందాం రా మూవీ 2000లో రిలీజై హిట్ కొట్టడమే కాకుండా ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా అవార్డు కొట్టేసింది. దాదాపు అన్ని సెంటర్స్ లో వంద రోజులు ఆడింది. ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన తెలుగు టాప్ టెన్ మూవీస్ లో వెంకీకి చెందిన కలిసుందాం రా,జయం మనదేరా,రాజా,ప్రేమించుకుందాం రా మూవీస్ ఉన్నాయి.