MoviesTollywood news in telugu

టాలెంట్ ఉన్న ఈ హీరో పరిస్థితి ఏమిటి…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో…?

Tollywood hero sudhakar komakula :సినిమా అనేది వింత ప్రపంచం.ఎప్పుడు హిట్ వస్తుందో ఎప్పుడు ప్లాప్ లు చూస్తామో తెలీదు. అయితే కొంతమంది దగ్గర టాలెంట్ ఉన్నా సరైన హిట్ పడకపోవడంతో నిరాశతో ఉంటారు. హిట్ కోసం తపిస్తుంటారు. ఈ జాబితాలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో ఎంట్రీ ఇచ్చిన సుధాకర్ కొముకుల ఆతర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు రాకపోవడంతో ప్రస్తుతం వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతున్నాడు.ఇక భార్యతో కల్సి కవర్ సాంగ్స్ చేస్తూ సుధాకర్ అలరిస్తున్న సంగతి తెల్సిందే.

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో బస్తీ కుర్రాడు నాగరాజు పాత్రలో మెప్పించిన సుధాకర్ కి మంచి పేరు వచ్చింది. నిజానికి అంతకుముందు కొన్ని సినిమాలు చేసినా పెద్దగా పేరు రాలేదు. ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత సెకండ్ హీరో,గెస్ట్ పాత్రలతో నెట్టుకొచ్చాడు.

అయితే హ్యాంగ్ అప్,ఉందిలే మంచికాలం ముందు ముందునా,కుందనపు బొమ్మ వంటి మూవీస్ లో హీరోగా చేసినా కూడా సుధాకర్ కి మంచి ఇమేజ్ తీసుకు రాలేక పోయాయి. అసలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా తెలీదు. అయితే మంచి టాలెంట్ ఉండడంతో హిట్ కోసం పరితపిస్తున్నాడు.