కీర్తి సురేష్ తొలి సంపాదనకు ఇప్పటికీ ఎంత తేడా… ?
Keerthi Suresh Remuneration :మహానటి మూవీతో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది నితిన్ తో కల్సి నటించిన రంగ్ దే సినిమాతో కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ స్టార్ హీరోయిన్ తొలి సంపాదన కేవలం 500 రూపాయలు కావడం విశేషం.
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి, పెద్దయ్యాక హీరోయిన్ గా అవతారం ఎత్తిన కీర్తి సురేష్ తన కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. పైగా ఈమె పేరెంట్స్ సినిమా రంగానికి చెందిన వారు కావడంతో ఈమెకు తెలుగులో ఆఫర్లు ఈజీగానే వస్తున్నాయి. చిన్నప్పుడు సినిమాల్లో నటించిన సమయంలో నిర్మాతలు ఇచ్చిన కవర్ ను డాడీకి ఇచ్చే దానినని కీర్తి సురేష్ తాజాగా ఓ ఇంటర్యూలో చెప్పింది. ఆ సమయంలో తనకు నిర్మాతలు ఎంత ఇచ్చారనే విషయం అస్సలు తెలియదని చెప్పింది.
అయితే ఫ్యాషన్ డిజైనింగ్ చేసే సమయంలో షోలలో పాల్గొన్నానని ఆ సమయంలో తనకు 500 రూపాయలు ఇచ్చారని అదే తన తొలి పారితోషికం అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. అలా వచ్చిన 500 రూపాయలను కూడా నాన్నకే ఇచ్చేశానని, ఎందుకంటే నాన్నకు అలా డబ్బులు ఇవ్వడం తనకు సెంటిమెంట్ గా ఉండేదని వివరించింది. అయితే ప్రస్తుతం 2 కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ అందుకునే రేంజ్ కి ఎదిగింది.