డ్యూయల్ రోల్స్ లో నటించిన స్టార్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్నారో…!?

Heroines Dual Roles :సాధారణంగా హీరోలు డబుల్ , త్రిబుల్ రోల్స్ వేస్తూ తమదైన శైలిలో నటనను కనబరుస్తూ వస్తున్నారు. అయితే  కొందరు హీరోయిన్స్ కూడా డబుల్ యాక్షన్ పాత్రలో నటించి తమ సత్తా చాటారు. గంగ మంగ మూవీలో వాణిశ్రీ డబుల్ రోల్ వేసింది. రెండు పాత్రలలో కూడా అదరగొట్టేసిందని అప్పట్లో జనాలు మెచ్చుకున్నారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ కూడా వేశారు. అప్పట్లో జీన్స్ మూవీలో ఐశ్వర్య రాయ్ రెండు పాత్రల్లో నటించి మెరుపులు మెరిపించింది. సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా రెండు పాత్రలలో  అంటే, ఒకటి దేవత, మరొకటి మామూలు పాత్రలో నటించింది.

అయితే ఇటీవల కాలంలో చూస్తే, అరుంధతి, పంచాక్షరి, వర్ణ సినిమాల్లో స్వీటీ అనుష్క డబుల్ రోల్స్ వేసి అదరగొట్టింది. నటి ప్రియమణి చారులత సినిమాల్లో కవలలుగా నటించి, మెప్పించింది.  మిల్క్ బ్యూటీ తమన్నా ఎందుకంటే ప్రేమంటే సినిమా లో పునర్జన్మ పాత్రలో నటించి, మెప్పించింది.  అలాగే  మగధీర సినిమాలో కాజల్ అగర్వాల్ పునర్జన్మ పాత్రల్లో కనిపించింది. ఇక మరో బ్యూటీ అసిన్ దశావతారం సినిమాల్లో ద్వి పాత్రలో నటించి, తన సత్తా చాటింది.

నటి మీరా జాస్మిన్ విషయానికి వస్తే,  అమ్మాయి బాగుంది సినిమాల్లో రెండు పాత్రల్లో నటించింది. త్రిష కూడా హారర్ మూవీ లో రెండు పాత్రల్లో చేసింది.  మరో తెలుగు సినీ నటి అర్చన ప్రేమతో నువ్వు వస్తావని సినిమాలో రెండు పాత్రల్లో నటించింది. జ్యోతిక, స్నేహ, సిమ్రాన్, మీనా లు కూడా తెలుగు లో కాకుండా ఇతర భాషలలో రెండు పాత్రల్లో బాగా నటించారు. మరో గ్లామర్ హీరోయిన్ ముమైత్ ఖాన్ పౌర్ణమి నాగమ్ సినిమాలో నాగు పాత్రలో, మామూలు పాత్రలో నటించింది. ఇక  గీతాంజలి, మసాలా సినిమాల్లో అంజలి  డబుల్ రోల్ లో కనిపించింది.