MoviesTollywood news in telugu

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. కార్తీక దీపంతో పాటు అన్ని సీరియల్స్‌ బంద్..

Lockdown effect on Serials : తెలంగాణలో ఉదయం పది గంటల నుండి లాక్డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. పది రోజులు లాక్ డౌన్ అమలులో ఉండగా పది రోజుల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం సినిమాల పై పడిన సీరియల్ లపై పడలేదు. గత సంవత్సరం లాక్ డౌన్ పెట్టినప్పుడు సీరియల్ షూటింగ్ లు ఆగిపోయాయి. ఇప్పుడు తెలంగాణలో లాక్ డౌన్ పెట్టడంతో సీరియల్స్ షూటింగ్ ఆగిపోతే సీరియళ్లు రియాలిటీ షోలు ఆగిపోతాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఎపిసోడ్లు కొన్ని రోజులు ప్రసారం అవుతాయి ఆ తర్వాత ఆగిపోయే అవకాశం ఉంది

గత మూడు వారాలుగా కేసులు భారీగా పెరగటంతో లాక్ డౌన్ పెట్టారు. అలాగే ఇండస్ట్రీలో కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగు తున్నాయి. కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారమే ఆర్ఎఫ్‌సీతో పాటు హైదరాబాద్‌లోని పలు స్టూడియోస్‌లో సీరియల్స్ షూటింగ్స్ జరుగుతున్నాయి. అయిన కొంత మంది సీరియల్ నటులు వరసగా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సీరియల్ నటులు కరోనా బారిన పడ్డారు.

కార్తీక దీపంతో పాటు మరిన్ని సీరియల్స్ షూటింగ్స్ కూడా ఇప్పటికే ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ 10 రోజులు పాత ఎపిసోడ్స్ ప్లే చేస్తారా.. లేదంటే ముందుగానే షూటింగ్ చేసి పెట్టుకున్నారా అనేది చూడాలి. ఏది ఏమైనా సీరియల్ అభిమానులకు చేదు వార్తే.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."