కరోనా సమయంలో బీరకాయ తింటున్నారా…ఊహించని లాభాలు
Beerakaya benefits in telugu :ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తలను తీసుకోవాలి. ఎలాంటి అశ్రద్ద ఉండకూడదు. వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తప్పనిసరిగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని కోసం మనం తీసుకొనే ఆహారంలో మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకొనే కూరల్లో బీరకాయ కూడా ఒకటి. ప్రతి రోజు బీరకాయ జ్యూస్ త్రాగితే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు, వైరస్‌లు శరీరానికి సోకుండా సహాయపడుతుంది.బీరకాయ కేవలం రోగనిరోధక శక్తి పెంచడం మాత్రమే కాదు.శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. .
ఇన్సులిన్ లెవల్స్ కంట్రోల్ చేసే శక్తి బీరకాయకు ఉండుట వలన డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా డైట్ లో బీరకాయను చేర్చుకోవాలి. బీరకాయల్లో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండుట వలన కంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు చాలా తక్కువగా.పీచు పదార్థాలు ఎక్కువగా ఉండుట వలన బరువు తగ్గేవారికి చాలా ప్రయోజనం కలిగిస్తుంది. బీరలో ఉండే విటమిన్- సి దగ్గు,గొంతు నొప్పి,జలుబు వంటి సమస్య నుంచి రక్షిస్తుంది.ఇక చర్మానికి కూడా బీరకాయ ఎంతో మేలు చేస్తుంది.ప్రతిరోజు ఒక గ్లాస్ బీరకాయ జ్యూస్ తాగితే.చర్మంపై ఉన్న ముడతలు తగ్గి, యవ్వనంగా మారుతుంది