కుటుంబం మొత్తం సీరియల్స్ లో నటిస్తున్న బుల్లితెర నటులు
Tv serial actors : వెండితెరతో సమానంగా బుల్లితెరకు మంచి డిమాండ్ ఉంది. ఎక్కువమంది ఆడియన్స్ బుల్లితెరకు కెనెక్ట్ అయ్యారు. అందుకే బుల్లితెరలో కూడా వారసత్వంతో పాటు ఒకే ఫ్యామిలీ నుంచి ఎక్కువమంది నటులుగా రాణిస్తున్నారు. ఓంకార్ తెలుగు సినిమా రచయితగా, నటుడిగా రాణించి,బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటించారు. ఈయన కొడుకు నిరుపమ్ పరిటాల చంద్రముఖి సీరియల్ తో స్టార్ట్ చేసి, ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో చేస్తున్నాడు. ఇతడి భార్య మంజుల కూడా చంద్రముఖి సీరియల్ లో నటించి, ప్రస్తుతం వదినమ్మ సీరియల్ లో చేస్తోంది. అలాగే మంజుల చెల్లెలు కీర్తి కూడా హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో చేస్తోంది. కీర్తి భర్త జై దనుష్ కూడా టివి నటుడే. ప్రస్తుతం నెంబర్ వన్ కోడలు సీరియల్ లో చేస్తున్నాడు.
ముద్దమందారం సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, బుల్లితెరమీద పలు కార్యక్రమాల్లో బిజిగా మారిపోయిన ప్రదీప్ కొన్ని సీరియల్స్ నిర్మించారు. ఈయన భార్య సరస్వతి పలు సీరియల్స్ లో నటించడమే కాదు, యాంకర్ కూడా. ప్రదీప్ సోదరుడు ఉదయ కూడా పలు సీరియల్స్ లో నటించి, కొన్ని సీరియల్స్ నిర్మించారు. ప్రదీప్ కూతురు నిహారిక చైల్డ్ ఆర్టిస్టుగా చేసి,పెద్దయ్యాక శశిరేఖా పరిణయం సీరియల్ లో నటించింది. మొగలి రేకులు, ఋతురాగాలు వంటి సీరియల్స్ లో నటించిన శృతి సింగంపల్లి ప్రస్తుతం నాగభైరవి సీరియల్ లో చేస్తోంది. ఈమె తల్లి నాగమణి చక్రవాకం వంటి కొన్ని సీరియల్స్ లో నటించింది. శృతి భర్త మధుసూదన్ కూడా టివి నటుడే. మొగలి రేకులు,చక్రవాకం వంటి సీరియల్స్ లో చేసాడు.
ఎన్నో సినిమాల్లో నటించిన సన తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో చేసింది. ప్రస్తుతం అరవింద సమేత సీరియల్ లో చేస్తోంది. సన కొడుకు సయ్యద్ అన్వర్ కూడా ఇదే సీరియల్ లో నటిస్తున్నాడు. సన కోడలు, అన్వర్ భార్య సమీరా ఎన్నో సీరియల్స్ లో చేస్తోంది. అందులో భార్యామణి సీరియల్ ఒకటి. అంతేకాదు, అత్తా, భర్త నటిస్తున్న అరవింద సమేత సీరియల్ లో కూడా సమీరా నటిస్తోంది. వైష్ణవి రామిరెడ్డ్డి పలు తెలుగు సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం దేవత సీరియల్ లో చేస్తోంది. వైష్ణవి రెడ్డి తండ్రి సీరియల్ డైరక్టర్. వైష్ణవి రెడ్డి చెల్లెలు దుర్గ ప్రస్తుతం స్టార్ మాలో వస్తున్న సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్ లో నటిస్తోంది. వైష్ణవి రెడ్డి తమ్ముడు విజయసింహ కొన్ని సీరియల్స్ నటించాడు. యాడ్స్ లో చేసాడు.
ప్రముఖ యాంకర్ సుమ కూడా సీరియల్ నటిగా వేయి పడగలు, గీతాంజలి వంటి ఎన్నో సీరియల్స్ చేసింది. ఈమె భర్త రాజీవ్ ఎన్నో సీరియల్స్ లో చేసాడు. తెలుగు సీరియల్ నటి రాగిణి సినిమాల్లోనే కాకుండా అమృతం, నాన్న వంటి హిట్ సీరియల్స్ లో నటించింది. ఈమె అక్క కృష్ణవేణి పలు సినిమాలు, సీరియల్స్ చేసి, ప్రస్తుతం హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో చేస్తోంది. రాగిణి అక్కయ్య కూతురు రజిత పలు తెలుగు సీరియల్స్ లో చేస్తోంది. నటుడు ప్రసాద్ బాబు ఎన్నో సినిమాల్లో చేసి, పలు సీరియల్స్ లో చేస్తున్నారు. ఈయన కొడుకు శ్రీకర్ కూడా పద్మవ్యూహం సీరి యల్ లో చేస్తున్నాడు. శ్రీకర్ భార్య సంతోషి కూడా మహాలక్ష్మి సీరియల్ లో చేసింది .వల్లభనేని శిరీష స్టార్ మాలో చెల్లెలి కాపురం సీరియల్ లో చేస్తోంది. ఈమె సోదరి రజిత కూడా ఇంటిగుట్టు సీరియల్ లో చేస్తోంది. శిరీష రెండవ అక్క సౌజన్య కూడా సప్తమాతృక అనే సీరియల్ లో నటించింది.