MoviesTollywood news in telugu

టాలీవుడ్ యంగ్ హీరోని గుర్తు పట్టారా…వెంటనే చూసేయండి

Tollywood Hero Nithin childhood photo : సినీ సెలబ్రిటీలు చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలను షేర్ చేసుకుంటున్న నేపథ్యంలో కొన్ని విషయాలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోకు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ ఫోటోలో ఉన్నది ఎవరంటే హీరో నితిన్. ఇక చిన్నప్పటి ఫోటో కావడంతో మరింత క్యూట్ గా కనిపిస్తున్నాడు.

అమ్మతో పాటు నితిన్ దిగిన ఈ ఫోటో నెటిజన్లను అలరిస్తోంది. మెడలో దండతో నితిన్ ఈ ఫోటోలో గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడు. నితిన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నితిన్ చైల్డ్ హుడ్ అని ఫోటో అని నితిన్ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు. కామెంట్స్ పెడుతున్నారు. డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ ఫ్లాపులు,హిట్లతో సంబంధం లేకుండా వరుస మూవీ ఆఫర్లతో బిజీగా మారిపోయాడు.

ప్రముఖ రచయిత,దర్శకుడు వక్కంతం వంశీకి తన సినిమాకు డైరెక్షన్ చేసే ఛాన్స్ నితిన్ ఇచ్చినట్టు టాక్. రచయితగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న వక్కంతం వంశీ డైరెక్టర్ గా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కాగా నితిన్ లాక్ డౌన్ సడలింపుల తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ ఏడాది రంగ్ దే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజయ్యాయి. ఇందులో చెక్ బిలో యావరేజ్ గా నిలిస్తే, రంగ్ దే హిట్ కొట్టింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."