MoviesTollywood news in telugu

ఊసరవెల్లి సినిమా హిట్ కాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?

oosaravelli movie : జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి మూవీ 2011 అక్టోబర్ 6న రిలీజై యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ మూవీ టివిలో వస్తుంటే,సినిమా బాగానే ఉందికదా ఎందుకు తేడా కొట్టింది అనిపిస్తుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ తొలివారం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నా, తర్వాత చతికిలబడి ఏవరేజ్ గా నిల్చింది. శక్తి మూవీ ప్లాప్ తర్వాత ఊసరవెల్లి మూవీ జూనియర్ ఎన్టీఆర్,సురేంద్రరెడ్డి కాంబోలో వస్తుండడంతో తారక్ ఫాన్స్ కసితో ఉన్నారు. కానీ వాళ్ళ అంచనాలు తలకిందులు అయ్యాయి. నిజానికి కిక్ మూవీ తర్వాత సురేంద్రరెడ్డి తీస్తున్న మూవీ,తారక్ స్టైలిష్ నెస్,ఆకట్టుకునే సాంగ్స్,ట్రైలర్ అన్నీ చూసాక అంచనాలు బాగా పెరిగాయి.

టోటల్ గా 27న్నర కోట్ల షేర్ కలెక్ట్ చేసి, బిలో ఏవరేజ్ మూవీ అయింది. 25కోట్లతో తీసిన ఈ సినిమా 10కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో 35కోట్లకు అమ్ముడైంది. అందులో 80శాతం మాత్రమే రాబట్టింది. తారక్ నటన, తమన్నా గ్లామర్ నటన, జయప్రకాశ్ రెడ్డి గ్యాంగ్ హాస్యం, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఇక స్క్రీన్ ప్లే చెప్పక్కర్లేదు. రిపీట్ ఆడియన్స్ రావాలి. కానీ టైటిల్ ఊసరవెల్లి అని పెట్టడం,మొదటి భాగంలో ఎన్టీఆర్ నటన హైలెట్ గా ఉన్నా,సెకండాఫ్ లో ఎన్టీఆర్ కి సంబంధం లేకుండా హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ నడవడం, తారక్ కన్పించకుండా ఆ ఎపిసోడ్ నడవడం మైనస్ అయింది.

హీరోకి ఆశయం లేకుండా, హీరోయిన్ ఆశయమే తన లక్ష్యంగా కథనం ఉండడం మైనస్ పాయింట్. పగ, ప్రతీకారం ఒకరిదే అవ్వాలని పరుచూరి బ్రదర్స్ చెప్పారు. అప్పుడే హీరో ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. పగ తీర్చుకోవడం, హీరోయిన్ ని విలన్స్ నుంచి కాపాడ్డం అనే కాన్సెప్ట్ అయితే సినిమా వేరే రేంజ్ లో ఉండేది. మొదటి భాగం వినోదంగా సాగి, సెకండాఫ్ సీరియస్ లో నడవడం మరో మైనస్. అందుకే క్లైమాక్స్ లో ఏదో కోల్పోయామన్న భావన ఫాన్స్ లో ఏర్పడింది. అప్పటి వరకూ తారక్ ని చూసిన తీరు వేరు, ఈ సినిమాలో తీరు వేరు. దీన్ని ఫాలో అవ్వడానికి ఫాన్స్ కి సమయం పట్టింది. అందుకే ఇప్పుడు సూపర్ మూవీ అంటున్నారు. ఇక దూకుడు మూవీ రెండు వారాలముందు వచ్చి మంచి దూకుడు మీద సాగిపోతోంది. మిక్స్ డ్ టాక్ రావడంతో ఊసరవెల్లి దెబ్బతింది.
https://www.chaipakodi.com/