కమెడియన్స్ తో ఆడి పాడిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?
Tollywood Heroines :ఇండస్ట్రీలో రకరకాల వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న క్యారెక్టర్ నుంచి ఎలాంటి క్యారెక్టర్స్ ఛాన్స్ వచ్చినా సరే, సినిమా వదలకుండా చేసుకుని వెళ్లే హీరోయిన్లు కొందరు ఉంటారు. ఇక స్టార్ హీరోయిన్ హోదాతో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు ఆ తర్వాత మంచి ఛాన్స్ లు రాలేకపోవడంతో ఉన్నదాంతో సరిపెట్టుకుని ఏ పాత్ర వస్తే అది చేసుకుని పోతుంటారు. ఎంత స్టార్ హోదా ఉన్నా సరే,చిన్న హీరోలతో కూడా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. మహానటి సావిత్రిని ప్రస్తావించాలి. 1957లో విడుదలయి సంచలన విజయం సాధించిన మాయాబజార్ సినిమాలో రేలంగితో మహానటి సావిత్రి ఒక పాట చేసింది.
నిజానికి సావిత్రికి ఆరోజుల్లో ఉన్న స్టార్ స్టేటస్ కి హాస్యనటుడితో పాట చేయడం పలువురిని ఆశ్చర్య పరిచింది. శుభలగ్నం మూవీలో కమెడియన్ అలీతో సౌందర్య ఓ స్పెషల్ సాంగ్ చేయడం సంచలనం అయ్యింది. అంతేకాదు,మాయలోడు మూవీలో బాబు మోహన్ తో కూడా అదే సాంగ్ చేయడం విశేషం. మీనా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో కమెడియన్ సుధాకర్ తో ఓ సాంగ్ చేసింది. అలీ కమెడియన్ నుంచి హీరోగా మారి చేసిన యమలీల మూవీలో ఇంద్రజ హీరోయిన్ గా నటించింది.
అంతేకాదు,ఘటోత్కచుడు సినిమాలో హీరోయిన్ గా రోజా చేసి ఆశ్చర్య పరిచింది. జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డితో పూర్ణ హీరోయిన్ గా యాక్ట్ చేసి,ఆకట్టుకుంది. సునీల్ హీరోగా చేసిన అందాల రాముడు మూవీలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించి అలరించింది.

