ఒక్కో సినిమాకు సాయి పల్లవి ఎంత పారితోషికం తీసుకుంటుందో…!?
SaiPallavi remuneration : సినిమా హిట్ అయితే వచ్చే ఆదరణకు,ఒకవేళ సినిమా ప్లాప్ అయితే వచ్చే నిరాదరణకు చాలా తేడా ఉంటుంది. ఒక్క సినిమా దెబ్బతింటే చాలు అప్పటి వరకూ ఆహా ఓహో అన్నవాళ్ళు కనీసం పలకరించడానికి కూడా జంకుతారు. ఇవన్నీ సినిమా పరిశ్రమలో నటనటులకు కొత్తేమి కాదు. ముఖ్యంగా గ్లామర్ మీద ఆధార పడ్డ హీరోయిన్స్ వరుస పరాజయాలు చూస్తే ఇక అంతేసంగతులు.
కానీ గ్లామర్ కన్నా, పాత్రలకు ప్రాధాన్యత నిస్తూ నటించే హీరోయిన్స్ కి హిట్స్ , ప్లాప్స్ తో సంబంధం ఉండదు. అందులో ప్రధానంగా చెప్పుకోవాలంటే సాయిపల్లవి. ఫిదా మూవీతో తెలుగు ఆడియన్స్ పరిచమైన ఈమె తన నటనతో ఫిదా చేసి,ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది.ఇక పాత్ర చిన్నదైనా సరే,ప్రాధాన్యత ఉండాలి కానీ, గ్లామర్ కి అస్సలు చోటివ్వదు.
సాయిపల్లవి తెలుగు,తమిళ తదితర భాషల్లో హీరోయిన్ గా దూసుకుపోతూ రౌడీ బేబీగా ముద్ర పడింది. అయితే ఈమె నటనకు గల ప్రాధ్యాన్యత తెలియడంతో నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. ఈమె రెమ్యునరేషన్ ప్రస్తుతం కోటి రూపాయలకు చేరిందని టాక్. ఈమె నటించిన విరాటపర్వం మూవీ తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది.

