MoviesTollywood news in telugu

ఈ స్టార్ హీరోయిన్ల భర్తల అస్థి,సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

Star Heroines Husbands Income :చాలామంది స్టార్ హీరోయిన్స్ గా ఓ వెలుగు వెలిగి,స్టార్ హీరోలను పెళ్లాడిన వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అందులో ప్రధానంగా అక్కినేని నాగార్జున విషయం తీసుకుంటే ఒకప్పటి వెండితెర స్టార్ హీరోయిన్,తన అందంతో ఆడియన్స్ మదిని కొల్లగొట్టిన అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కల్సి శివ, కిరాయిదాదా వంటి హిట్ మూవీస్ లో నటించారు. యువ హీరోలకు ధీటుగా రాణిస్తున్న టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వివిధ రంగాల్లో వ్యాపారాలు చేస్తూ దాదాపు 850కోట్లు కూడబెట్టాడని టాక్.

సూపర్ స్టార్ కృష్ణ నటవారసునిగా అడుగుపెట్టి ప్రిన్స్ మహేష్ బాబు తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగాడు. స్టార్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ మహేష్ ని ప్రేమించి పెళ్లాడింది. యాడ్స్ తో పాటు పలు వ్యాపారాల్లో కూడా బిజీగా ఉన్న మహేష్ ఆస్థి 113కోట్లు ఉంటుందని టాక్.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ స్టార్ ప్రొడ్యూసర్ సిద్దార్ధ్ రాయ్ కపూర్ ని పెళ్ళాడి,పెళ్లితర్వాత కూడా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. అయితే కపూర్ ఆస్థి విలువ 475మిలియన్ల ఉంటుందని అంచనా.

టాలీవుడ్, బాలీవుడ్ లలో పలు హిట్స్ అందుకున్న హీరోయిన్ ఆసిన్, మైక్రో మాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను పెళ్లాడింది. ఇతడి నికర ఆస్థి 668కోట్లు అని అంచనా.

బ్రిటిష్, ఇండియన్ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాను ప్రేమించి పెళ్లిచేసుకున్న శిల్పాశెట్టి తెలుగులో కూడా మంచి సినిమాలు చేసింది. ఐపీఎల్ టీమ్ రాయల్ టీమ్ కి యజమాని అయిన కుంద్రా నికర ఆస్థి 3వేల కోట్లు.

ధర్మేంద్ర, హేమమాలిని దంపతుల కుమార్తె ఈషా డియోల్ తన చిన్నప్పటి ఫ్రెండ్ భరత్ తఖ్తా నిని పెళ్లాడింది. అతడి నికర ఆస్థి 475మిలియన్ డాలర్లు.

రెండు కంపెనీలకు ఓనర్ గా ఉన్న సోనంద్ అహుజాను పెళ్లాడిన సోనమ్ కపూర్ ఒక కంపెనీకి యజమానిగా ఉంది. అహుజా నికర ఆస్థి 3వేల కోట్లు ఉంటుందట.

ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అనిత్ తడానిని స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ పెళ్లాడింది. అనిత్ ఆస్థి విలువ 6న్నర మిలియన్ డాలర్లట.

యష్ రాజ్ ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ అధినేత ఆదిత్య చోప్రాను హీరోయిన్ రాణి ముఖర్జీ పెళ్లాడింది. చోప్రా నికర ఆస్థి 6,350కోట్లట.

ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీని అనుష్కా శర్మ పెళ్లాడింది. యాడ్స్,అన్నీ కల్పి మొత్తం కోహ్లీ ఆస్థి 26మిలియన్ డాలర్లట.

మెహతా గ్రూప్ యజమాని జయ్ మెహతాను జూహ్లీ చావ్లా పెళ్లాడింది. ఆఫ్రికా, యుఎస్ కెనడా లలో విస్తరించి అతడి వ్యాపారాలున్నాయి. అతడి నికర ఆస్థి 2,400కోట్లు.