Healthhealth tips in telugu

కరోనా సమయంలో వేడి నీటితో స్నానం చేస్తున్నారా…అయితే ఇవి తెలుసుకోండి

Hot water Benefits :కరోనా సమయంలో వేడి నీటి గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. వేడి నీటితో.. కరోనా వైరస్‌ను నిర్మూలించడం, కరోనా తీవ్రతను తగ్గించడమనే దాంట్లో వాస్తవం లేదని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ల్యాబొరేటరీల్లో 70 డిగ్రీల కన్నా అధిక ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే కరోనా వైరస్ మరణిస్తుందని తెలిపింది.అయితే కొంతవరకు మాత్రమే ఉపశమనం కలుగుతుంది.

మనలో చాలా మందికి వేడి నీటి స్నానం మంచిదా చల్లని నీటితో స్నానం మంచిదా అనే సందేహం ఉంటుంది దీనిమీద కొంత పరిశోధన జరిగింది ఆ పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయట పడ్డాయి. వేడినీటి స్నానం చేయటం వలన శరీరానికి కొంత వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుంది. అలాగే ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేసిన వారిలో గొంతుకు సంబంధించిన సమస్యలు తగ్గినట్టు వారి పరిశోధనలో తేలింది.

వేడి నీటితో స్నానం చేయడం వలన శరీరంలో రక్తం సరఫరా పెరగడం రక్తపోటు తగ్గడం వంటివి జరగడం వలన గుండె సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు అంటున్నారు. వేడినీటి స్నానం అంటే మరీ వేడిగా కాకుండా గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది. కాలంతో సంబంధం లేకుండా ప్రతిరోజు వేడినీటి స్నానం చేయవచ్చు.