Healthhealth tips in telugu

కరోనా వచ్చినప్పుడు వీటికి దూరంగా ఉండాల్సిందే… లేకపోతే…!?

corona Food :కరోనా వైరస్ ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ చాలా స్పీడ్ గా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత బెడ్స్ కొరత చాలా ఎక్కువగా ఉంది. కరోనా అదుపు చేయడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అలాగే లాక్ డౌన్ కూడా పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వచ్చిన వారు ప్రాణాలను కాపాడుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఆయిల్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరగడమే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరు తగ్గుతుంది. అప్పుడు కరోనా నుంచి కోలుకోవడం కాస్త కష్టం అవుతుంది. కరోనా వచ్చిన వారికి రుచి తెలియడం లేదని మసాలాలు కారాలు ఎక్కువగా తీసుకుంటున్నారు అలా తీసుకుంటే గ్యాస్ కడుపుబ్బరం చాతిలో మంట రావటమే కాకుండా దగ్గు కూడా పెరుగుతుంది.

ప్రాసెస్ చేసిన ఆహారాలు డ్రింక్ చిప్స్ వంటివి తీసుకోకూడదు. ఈ సమయంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటానికి అవసరమైన ఆహారాలను తీసుకోవాలి పైన చెప్పిన ఆహారం తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలహీనమవుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలను పాటించి కరోనా నుంచి తొందరగా బయట పడటానికి ప్రయత్నం చేయాలి.