సూపర్ స్టార్ ఇంటికి ధనుష్ అల్లుడు ఎలా అయ్యాడో తెలుసా ?
superstar rajinikanth and dhanush :తమిళంలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ధనుష్ కి తమిళంలోనే కాదు,తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఫాన్స్ ఉన్నారు. తమిళంలో ఓ చిన్న మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధనుష్ ను చూసి వీడు హీరో ఏంట్రా బాబూ అని కామెంట్ చేసారు. కానీ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలవడానికి ఇండస్ట్రీలో చాలామందికి సమయం పడుతుంది. అపాయింట్ మెంట్ అంత ఈజీ కాదు. అలాంటిది రజనీకాంత్ ఇంటికి అల్లుడు అవ్వడం అంటే మామూలు విషయం కాదు. రెండో సినిమా సూపర్ హిట్ కావడంతో అతడి నటనకు రజనీ కూతురు ఐశ్వర్య ఫిదా అయిందట.
ఒక బొకే పంపడంతో పాటు బాగా నటించారు, కంగ్రాట్స్ , కీప్ ఇన్ టచ్ అనే మెసేజ్ కూడా ఐశ్వర్య పెట్టిందట. ఇక ఒకసారి కాఫీ హోటల్ లో కల్సి మాట్లాడుకున్నామని, ఇది తెలుసుకున్న మీడియా ప్రేమలో పడ్డట్లు వార్తలు రావడంతో వైరల్ అయ్యాయని ధనుష్ చెప్పాడు. అయితే పెద్దలు మాట్లాడడంతో పెళ్ళికి ఒకే అయిందని, ఆమె ఒప్పుకుంటుందని కూడా ఊహించలేదని, ఆరు మాసాలకే పెళ్లి కూడా అయిందని ధనుష్ చెప్పు కొచ్చాడు.