MoviesTollywood news in telugu

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Telugu Actress Lissy : కొందరు హీరోయిన్స్ తక్కువ సినిమాలు చేసిన ఎక్కువ పాపులార్టీ తెచ్చుకుని ఆడియన్స్ మదిలో గుర్తుండిపోతారు. అలాంటి వాళ్లలో ఒకప్పటి హీరోయిన్ లిజి ఒకరు. ఈమె కేవలం తెలుగులో 8 సినిమాలు మాత్రమే చేయగా, రెండు మూడు మినహా అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మహా అయితే రెండేళ్లు తెలుగు వెండితెరపై మెరిసిన ఈమె తర్వాత ఏ సినిమా చేయలేదు.

కేరళలో పుట్టి పెరిగిన లిజి చిన్నప్పుడే పేరెంట్స్ విడిపోవడంతో తల్లి దగ్గరే పెరిగి పెద్దదైంది. 16ఏళ్ల వయస్సులో ఇంటర్ చదువుతుండగా మలయాళ మూవీలో చేసి, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏడాదికి 20సినిమాలు చేసే స్థాయికి ఎదిగి విపరీతంగా పాపులార్టీ సంపాదించింది. రాజేంద్ర ప్రసాద్ తో సాక్షి మూవీలో నటించి టాలీవుడ్ కి 1989లో ఎంట్రీ ఇచ్చింది. 1991వరకూ మాత్రమే లిజి ఇక్కడ పనిచేసింది.

సుమన్ హీరోగా వచ్చిన 20వ శతాబ్దం , దోషి నిర్దోషి, ఆత్మబంధం అనే మూవీస్ లో లిజి హీరోయిన్ గా చేసింది. భానుచందర్ తో స్టూవర్టుపురం దొంగలు, రాజశేఖర్ నటించిన మగాడు మూవీస్ తో పాటు మామశ్రీ లో కూడా లిజి నటించింది. 1990లో డైరెక్టర్ ప్రియదర్శన్ ప్రేమలో పడిన ఈమె మొత్తానికి పెళ్లిచేసుకుంది. అప్పటికే ఒప్పుకున్నా సినిమాలు పూర్తిచేసి, ఫ్యామిలీకి అంకితం అయ్యింది. తెలుగులో తక్కువ చేసినా మాలయంలో 100సినిమాలు చేసింది. ఇక తెలుగులో ఎన్ని ఆఫర్స్ వచ్చినా సరే, సినిమాలకు దూరంగానే ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."