MoviesTollywood news in telugu

యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న రామ్…క్రేజీ రికార్డ్

Tollywood Hero Ram :వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో దేవదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలిసినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ పోతినేని ఆతర్వాత పలు హిట్ మూవీస్ చేసాడు. అయితే కెరీర్ ఒక్కసారిగా డౌన్ అవుతున్న సమయంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో తీసిన పక్కా మాస్ మసాలా మూవీ ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ అందుకుంది.

మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చినా తర్వాత కలెక్షన్స్ వర్షం కురిపించింది. రామ్ తో పాటు పూరి జగన్నాధ్ కి,ఛార్మికి కూడా ఈమూవీతో మళ్ళీ కల్సి వచ్చింది. అంతేకాదు ఈ మూవీ యూట్యూబ్ లో హిందీలో డబ్ కావడంతో అక్కడ 200మిలియన్ వ్యూస్ తో అదరగొట్టేస్తోంది. ఇప్పటికే రామ్ నటించిన జగడం,హలొ గురు ప్రేమకోసమే మూవీస్ యూట్యూబ్ లో 300మిలియన్ వ్యూస్ దాటేశాయి.

తాజాగా ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన కిక్కు వేరని చెప్పాలి. మొత్తానికి డబ్బింగ్ వెర్షన్ కి ఇంతలా వ్యూస్ రావడం గ్రేట్. కాగా ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ కృతిశెట్టితో కల్సి లింగుస్వామి డైరెక్షన్ లో రామ్ నటిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ్ వెర్షన్ లో కూడా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.