ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఎంతవరకు చదివాడో తెలిస్తే షాక్ అవుతారు
Tollywood music director gopi sunder :చదువుకి ,రాణించే వృత్తికి అసలు సంబంధం ఉండదు. అసలు చదువు కొలబద్ద కూడా కాదు. ఎక్కువ చదువుకోకపోయినా బాగా రాణించినవాళ్లు ఎందరో ఉన్నారు. అందులో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఒకడు. తెలుగులో యితడు చేసిన సినిమాలు తక్కువే అయినా, ఇతడి సినిమాల్లో సాంగ్స్ రికార్డ్ క్రియేట్ చేశాయి. అందునా స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ రాకుండా మిడిల్, యంగ్ హీరోల సినిమాలకు ఛాన్స్ బాగానే వచ్చింది.
కేరళలోని కొచ్చిన్ కి చెందిన గోపి సుందర్ కి తండ్రి సినిమా ఇండస్ట్రీలో ఉండడం బాగా కల్సి వచ్చింది. తండ్రికి రికార్డింగ్ స్టూడియో ఉండడంతో చిన్నప్పటి నుంచి సంగీతంపై మక్కువ పెంచుకున్నాడు. జింగిల్స్ తో మ్యూజిక్ ఇండస్ట్రీలోకి కాలుపెట్టిన గోపి సుందర్ కి అన్నీ బాగా కల్సి వచ్చాయి. మోహన్ లాల్ నటించిన ఫ్లాష్ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన గోపి సుందర్ కి మలయాళ మూవీస్ లో వరుస ఆఫర్స్ వచ్చాయి.
ఇక మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. గీత గోవిందం మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఊపిరి, భలే భలే మగాడివోయ్ మూవీస్ కి సంగీతం అందించి తనకొక ఇమేజ్ తెచ్చుకున్నాడు. 18పేజెస్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీస్ కి సంగీతం అందించగా, త్వరలో రిలీజ్ కానున్నాయి. అయితే అతడు పదవతరగతి తప్పడంతో కుంగిపోకుండా తనకు ఇష్టమైన మ్యూజిక్ రంగంలో కాలుపెట్టి సక్సెస్ అందుకుంటున్నాడు.