MoviesTollywood news in telugu

ఆరెంజ్ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తుందో తెలుసా?

orange movie fame sanchita shetty : మెగా ఫ్యామిలీలో ఓ కుదుపు కుదిపేసిన సినిమా అనగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ గుర్తొస్తుంది. ఈ మూవీని నాగబాబు నిర్మించగా, బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆరెంజ్ మూవీని మెగా ఫాన్స్ జీర్ణించు కోలేకపోయారు. తీరని నష్ఠాలను,కష్టాలను మిగిల్చిన ఈ మూవీలో సంచిత శెట్టి హీరోయిన్ గా చేసింది.

ఏకంగా రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసి, టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంచితకు ఈ సినిమా ప్లాప్ కారణంగా గుర్తింపు లేకుండా పోయింది. దాంతో చెన్నై చెక్కేసింది.నిజానికి కన్నడ మూవీ ముంగారు ములై తో సినిమాలో ఎంట్రీ ఇచ్చి, తక్కువ కాలంలోనే తెలుగులోకి ప్రవేశించి, రామ్ చరణ్ సరసన నటించింది. కానీ ఈ మూవీ ప్లాప్ కావడంతో ఆ దెబ్బ సంచితకు తగిలేసింది.

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సంచిత ఈమధ్య కరోనా వాక్సిన్ కూడా వేయించుకుని, ప్రతిఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలని కోరుతూ ఇంస్టా గ్రామ లో పోస్ట్ చేసింది. అయితే తెలుగులో ఛాన్స్ లు రాకపోయినా తమిళంలో బాగానే నిలదొక్కుకుంది. 5మూవీస్ లో నటిస్తుండగా ఓ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇక సోషల్ మీడియాలో ఫోటో షూట్ ఫొటోస్ అప్ లోడ్ చేస్తూ ఫాన్స్ కి దగ్గరగానే ఉంటోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."