ప్రణీత పెళ్లికి.. తన సినిమాలకు ఉన్న లింక్ ఏంటో మీకు తెలుసా?
Tollywood Heroine pranitha Movies :తన అందంతో,అభినయంతో టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరైన హీరోయిన్ ప్రణీత సుభాష్ బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లాడింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అతికొద్ది మందిని ఆహ్వానించి గడిచిన ఆదివారం ఆమె వివాహం చేసుకుంది. అయితే త్వరలో ‘భుజ్’, ‘హంగామా 2’ చిత్రాలతో హిందీ చిత్ర పరిశ్రమలో సత్తా చాటబోతోంది.
తెలుగులో పవన్‌కల్యాణ్‌తో అత్తారింటికి దారేది,మహేశ్‌బాబుతో బ్రహ్మోత్సవం,ఎన్టీఆర్‌తో రభస,అలాగే పాండవులు పాండవులు తుమ్మెదా, డైనమైట్, హాలోగురు ప్రేమకోసమే వంటి చిత్రాల్లో ప్రణీత నటించింది. తెలుగుతో పాటు కన్నడ,తమిళ్,హిందీ భాషల్లో కూడా చేస్తోంది. తమది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమని ప్రణీత సుభాష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో పలువురు ఫాన్స్ అభినందనలతో ముంచెత్తుతున్నారు.
సినిమాల పరంగా చూస్తే, అత్తారింటికి దారేదిలో పవన్ మొదటి ప్రణీతను ఇష్టపడతాడు, కానీ సమంతను చేసుకుంటాడు. హలొ గురు ప్రేమ కోసమే మూవీలో కూడా మొదట ప్రణీతను రామ్ ఇష్టపడినా, తర్వాత అనుపమ పరమేశ్వరన్ ని పెళ్లిచేసుకుంటాడు. ఇంచుమించు రభస మూవీలో కూడా అలానే ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ప్రేమించినవాడినే పెళ్లాడింది. చాలా కాలంగా మా మధ్య పరిచయం ఉంది. ఒకరి గురించి మరొకరికి తెలుసు. జీవితాంతం కలిసుండాలని నిర్ణయించుకున్నాం. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ… బంధుమిత్రుల సమక్షంలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నాం అని ప్రణీత చెప్పుకొచ్చింది.