కరోనా సమయంలో అదే పనిగా మాస్కు వాడుతున్నారా…. అయితే జాగ్రత్త
corona Face mask :ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మాస్క్ ధరించటం తప్పనిసరి. మాస్క్ మనల్ని కరోనా నుంచి రక్షిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బయటకు రావాలంటే మాస్క్ ధరించటం తప్పనిసరి. మాస్క్ పెట్టుకోవటం వలన వచ్చే సమస్యలు గురించి తెలుసుకుందాం.
అదే పనిగా మాస్క్ పెట్టుకుంటే చర్మం వికారంగా మారే అవకాశం ఉంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటం వలన బయటకు వెళ్లాలంటే మాస్క్ ధరించటం తప్పనిసరి. మాస్కులు లేకుండా వెళితే సురక్షితం కాదని భయాందోళన ప్రతి ఒక్కరు లో ఉంది. అయినా మాస్క్ పెట్టుకోవాల్సిందే. మాస్క్ ఎక్కువసేపు పెట్టుకోవటం వలన చర్మ సంబంధ సమస్యలు వస్తున్నాయి. ముఖం పై గీతలు గాయాలు కూడా అవుతున్నాయి.. మాస్క్ పెట్టుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
మాస్కులు చెమట తేమను పీల్చుకుంటాయి. ఫ్యాబ్రిక్ కారణంగా చర్మం పై ఒత్తిడి పడుతుంది. చర్మంపై ఇరిటేషన్ వస్తుంది. లాండ్రీ డిటర్జెంట్ నుంచి వచ్చే అవశేషాలు ముఖం కప్పి ఉంచే బట్టలు ఉంటాయి. మీ చర్మాన్ని దెబ్బతినేలా చేస్తాయి అందువల్ల మూడు లేయర్ లు ఉన్న మాస్క్ వాడటం మంచిది.
మీరు ధరించే మాస్కులు మీ చర్మం పై రంద్రాలు అడ్డుకోకుండా ఉండేవి మంచిది. రోజుకు రెండుసార్లు ముసుగు ధరించిన వెంటనే మీ ముఖం కడుక్కోవాలి. మొటిమలు ఉన్నవారు సాత్విక్ యాసిడ్ వంటి వాటితో ప్రయోజనం పొందవచ్చు. మాస్క్ తో కప్పిన చర్మంపై భారీ మాయిశ్చరైజర్ వాడటం మానేయండి. మాస్క్ వాడిన ప్రతి సారి వైట్ వెనిగర్,డిటర్జెంట్ వంటి వాటితో వేడి నీటితో కడగాలి.

