సాయిధరమ్ తేజ్ లైఫ్ స్టైల్…ఎన్ని కోట్ల అస్థి…!?
Tollywood Hero Sai Dharam tej :మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ హీరోగా తనదైన శైలిలో మూవీస్ చేస్తూ ముందుకి వెళ్తున్నాడు.1986అక్టోబర్ 15న హైదరాబాద్ లో శివ ప్రసాద్, విజయదుర్గలకు జన్మించిన ఇతడికి ప్రస్తుతం 35ఏళ్ళు. ఇతడి తమ్ముడు వైష్ణవ తేజ్ కూడా ఉప్పెన మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇతడికి తేజ్, చింటూ అనే ముద్దుపేర్లు న్నాయి. నెల్లూరు రెయిన్ బో హైస్కూల్ లో 6వ తరగతి వరకూ చదువుకున్నాడు.
నెల్లూరులో స్కూల్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకెళ్లేవాడు. ఏదో ఒకటి కొనిస్తే తప్ప స్కూల్ కి వెళ్ళేవాడు కాదు. తర్వాత హైదరాబాద్ నలంద హైస్కూల్ లో చదువుకున్నాడు. సెయింట్ మేరీస్ కాలేజీలో ఎడ్యుకేషన్ పూర్తిచేసాడు. చదువు అయ్యాక జాబ్ చేయడం స్టార్ట్ చేసాడు. అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వాలని భావించి,2015లో వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో రేయ్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. బడ్జెట్ పెరిగిపోవడంతో షూటింగ్ ఆగిపోయింది. దాంతో ఏ ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో పిల్లా నువ్వులేని జీవితం మూవీతో కెరీర్ స్టార్ట్ అయింది.
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,సుప్రీం,విన్నర్,చిత్రలహరి,సోలో బ్రతుకే సో బెటర్ మూవీస్ తో సాయిధరమ్ తేజ్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. పిల్లా నువ్వులేని జీవితం మూవీ కోసం 60లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అయితే సోలో బ్రతుకే సో బెటర్ మూవీకి 11కోట్లు దాకా అందుకున్నాడు. నెట్ వర్త్ రూ200కోట్లు ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి,పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమైన హీరోలు. శ్రీదేవి ఇష్టమైన హీరోయిన్. క్రికెట్ ఆడడం,ట్రావెలింగ్ అంటే ఇష్టం. పప్పు ఆవకాయ్ అంటే ఇతడికి చాలా ఇష్టం. హైదరాబాద్,ఊటీ అంటే ఇష్టమైన ప్రదేశాలు. ఇతడికి మూడు విలాసవంతమైన కార్లు,ఒక స్పోర్ట్స్ బైక్ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఎంపీ ఎం ఎల్ ఏ క్వార్ట్రర్స్ దగ్గర ఖరీదైన ఇల్లు ఉంది.