పెదరాయుడు సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తు పట్టారా…?
pedarayudu movie Manchu manoj :డైలాగ్ కింగ్ గా పేరుతెచ్చుకున్న మోహన్ బాబు హీరోగా ఎన్నో సినిమాలు చేసారు. రికార్డు కలెక్షన్స్ తో కలెక్షన్ కింగ్ అయ్యారు. ఇప్పుడు ఆయన తనయుడు మంచు విష్ణు,మంచు మనోజ్,కుమార్తె మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాలు చేసి, హిట్ లేక తపిస్తున్న మంచు మనోజ్ ప్రస్తుతం అహం బ్రహ్మస్మి మూవీ చేస్తున్నాడు.
అప్పట్లో మోహన్ బాబు నటించిన పెదరాయుడు మూవీ ఆంధ్రదేశంలో ఓ ఊపు ఊపేసింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో మోహన్ బాబు డబుల్ యాక్షన్ చేసాడు. రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో భానుప్రియ,సౌందర్య హీరోయిన్స్. అప్పట్లో ఈ మూవీ సంచలన విజయం సాధించి ఇండస్ట్రీలో మోహన్ బాబు ఇమేజ్ ని అమాంతం పెంచేసింది.
ఈ సినిమా రిలీజై 26ఏళ్ళు పూర్తికావడంతో ఈసందర్బంగా పోస్టర్స్, 200రోజుల విజయోత్సవ వేడుకల స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, రజనీకాంత్ అప్పటి సీఎం చంద్రబాబు తదితరులు ఉన్నారు. అందులో బాలనటుడిగా మంచు మనోజ్ ఉండడంతో తన ఇంష్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలు షేర్ చేయగా, వైరల్ అవుతున్నాయి.