MoviesTollywood news in telugu

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?

Tollywood Heroine Deeksha Seth :కొందరు హీరోయిన్స్ ఇలా మెరిసి అలా వెళ్ళిపోతారు. ఇండస్ట్రీకి దూరంగా జరిగి ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా తెలీదు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ఆలాంటి వాళ్ళ ఫోటోలు వైరల్ అవుతూ వారి నటనను, వాళ్ళను గుర్తుచేస్తోంది. తాజాగా ఇలాంటి ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు ఇంష్టాగ్రామ్ లో వైరల్ అయ్యాయి.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే వేదం మూవీలో చేసిన దీక్షా సేధ్. అనుష్క నటించిన ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. ఈమె తెలుగు,కన్నడ,తమిళ భాషల్లో దాదాపు 10చిత్రాల్లో నటించింది. రవితేజ,గోపీచంద్,మంచు మనోజ్ వంటి హీరోల సరసన నటించింది. అయితే వ్యక్తిగత కారణాలతో ఇండస్ట్రీకి దూరమైంది.

ఈమె ఆఖరు సారిగా కన్నడ మూవీ జగ్గూదాదా లో నటించినట్లు చెబుతుంటారు. అయితే నటించింది కొన్ని సినిమాలే అయినా నటన పరంగా మంచి మార్కులే తెచ్చుకుంది. అయితే తాజాగా వైరల్ అవుతున్న చిన్ననాటి ఫోటో తన ఫ్రెండ్ తో 1998లో తీయించుకున్నట్లు ఆమె రాసుకొచ్చింది. దీంతో చాలా క్యూట్ గా ఉంది ఫోటో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."