MoviesTollywood news in telugu

NTR గురించి ఈ నమ్మలేని నిజాలు మీకు తెలుసా…అసలు నమ్మలేరు

Tollyowood hero NTR :విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ పోలికలు పుణికిపుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కల్సి ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. ఈమధ్యే కరోనా నుంచి కూడా కోలుకున్నాడు. నందమూరి హరికృష్ణ కుమారుడైన తారక్ చిన్నతనంలో ఎన్టీఆర్ దగ్గరే పెరిగినట్లు చెబుతారు.

ఎన్టీఆర్ బతికున్న రోజుల్లో తారక్ పదేళ్ల ప్రాయంలో బాలరామాయణంలో రాముడిగా నటించి మెప్పించాడు. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని ఎం ఎస్ రెడ్డి నిర్మించారు. అలాగే ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీలో కూడా బాలనటుడిగా నటించాడు. చిన్న తనం నుంచి నటన మీద ఆసక్తి గల తారక్ కూచిపూడి డాన్స్ లో శిక్షణ పొందాడు. అందుకే తన సినిమాల్లో డాన్స్ లతో అదర గొడుతున్నాడు.

నిను చూడాలని మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో స్టార్ హీరో గా ఎదిగాడు. సింహాద్రి మూవీతో టాప్ హీరో అయ్యాడు. ఈమధ్య వరుస హిట్స్ తో మంచి ఫార్మ్ లో ఉన్నాడు. ఇక తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరపున 2009లో ప్రచారం కూడా చేసి, తన స్పీచ్ తో జనంలోకి దూసుకుపోయాడు. తర్వాత మళ్ళీ రాజకీయాలవైపు అడుగులు వేయలేదు. అయినా టిడిపి శ్రేణుల్లో జూనియర్ ఎన్టీఆర్ స్మరణ ఆగలేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."