MoviesTollywood news in telugu

గోపీచంద్ లైఫ్ స్టైల్…ఎన్ని కోట్ల అస్థి…?

Tollywood Hero Gopichand :ఒకప్పుడు వరుస హిట్స్ అందించి అకాల మరణం చెందిన స్టార్ డైరెక్టర్ టి కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన హీరో గోపీచంద్ మొదట్లో విలన్ పాత్రలు వేసి,ఆతర్వాత హీరో అయ్యాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరులో 1979జూన్ 12న జన్మించిన ఇతడి అసలు పేరు తొట్టెంపూడి గోపీచంద్. ప్రస్తుతం 42ఏళ్ళు పూర్తయ్యే ఇతడిని గోపి,చరణ్ అని పిలుస్తారు. టంగుటూరులోని పాపారావు పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న యితడికి 2013మే 12న పెద్దల ఆశీర్వాదంతో రేష్మాతో ఘనంగా పెళ్లయింది. వీరికి విరాట్ కృష్ణ అనే కుమారుడున్నాడు.

హీరోగా ఇండస్ట్రీకి రావాలని అనుకుంటే ముందుగా స్టడీస్ మీద దృష్టిపెట్టమని తల్లి సూచించడంతో గోపీచంద్ రష్యా వెళ్లి స్టడీస్ పూర్తిచేసుకుని వచ్చాడు. 2001లో తొలివలపు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఆశించిన రీతిలో పేరుతెలేదు. దాంతో ఛాన్స్ లు రాలేదు. ఇక 2002లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన నిజం మూవీలో గోపీచంద్ అయిష్టంగానే విలన్ క్యారెక్టర్ చేసాడు. ఆ మూవీతో మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం మూవీలో కూడా విలనిజం పండించాడు.

అయితే 2004లో రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన యజ్ఞం మూవీతో గోపీచంద్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆతర్వాత లౌక్యం వంటి హిట్ మూవీస్ లో నటించి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ప్రస్తుతం పక్కా కమర్షియల్ అనే మూవీతో రాబోతున్నాడు. ఇతడికి ప్రభాస్ ఇష్టమైన హీరో. త్రిష ఇష్టమైన హీరోయిన్. ఆస్ట్రేలియా ఇష్టమైన ప్రదేశం. చెస్ ఆడడం, టివి చూడడం హాబీ. ఒక్కో సినిమాకు మూడు కోట్లు వరకూ తీసుకునే ఇతడి నెట్ వర్త్ 70కోట్లు.జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 60లో దాదాపు 7కోట్ల విలువైన ఇంట్లో నివాసం ఉంటున్నాడు.ఇతడికి సౌకర్యవంతమైన రెండు కార్లు ఉన్నాయి.