MoviesTollywood news in telugu

బాలీవుడ్ భామలు నటించినా తేడా కొట్టిన సినిమాలు

Bollywood heroines failed in tollywood :ఒకప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్నా, రానురాను సినిమా హిట్ కావాలంటే అందమైన భామలు హీరోయిన్స్ గా కన్పించాలి. దాంతో బాలీవుడ్ నుంచి భామలను హీరోయిన్స్ గా సెలెక్ట్ చేసి,అధిక రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసిన సినిమాల్లో కొన్ని హిట్ కొట్టగా,కొన్ని డిజాస్టర్ అయ్యాయి. వరుస హిట్స్ కొడుతున్న డైరెక్టర్ శ్రీను వైట్ల తొలిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బ్రూస్ లీ మూవీ చేసాడు. ఇందులో బాలీవుడ్ భామ టిస్కా చోప్రా విలన్ గర్ల్ ఫ్రెండ్ గా నటించింది.దీంతో ఇలాంటి నటి పాత్రను ఇంతలా డీ మొరలైజ్ చేసేలా డిజైన్ చేయడాన్ని ఆడియన్స్ జీర్ణించుకోలేదు.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి మూవీలో విలన్ తల్లి క్యారెక్టర్ లో పూజాబేడి నటించింది. పాపం ఈమూవీకి పాన్ ఇండియా మూవీలో బడ్జెట్ పెట్టారు. పూజా ఆకట్టుకోలేదు సరికదా సినిమా కూడా పెద్దగా ఆడలేదు సరికదా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. విఐపి మూవీకి సీక్వెల్ విఐపి 2లో బాలీవుడ్ హీరోయిన్ అధిక రెమ్యునరేషన్ తీసుకుని మరీ కాజోల్ కీలక పాత్ర చేసింది. అయితే సినిమాకు ఆమె ఏమాత్రం దోహదపడలేదు.

చంద్రలేఖ మూవీలో నాగార్జునతో కల్సి చేసిన ఇషా కొప్పికర్ ఆతర్వాత కొన్ని సినిమాల్లో చేసింది. అయితే యువ హీరో నిఖిల్ నటించిన కేశవ మూవీలో పోలీసాఫీసర్ పాత్ర వేసింది. అయితే ఈ మూవీ ఏవరేజ్ గా మిగిలింది. ఈ సినిమాలో ఇషాని సెలక్ట్ చేయాల్సిన అవసరం లేదన్న టాక్ వచ్చింది. ఇక డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ హీరోగా తీస్తున్న రొమాంటిక్ మూవీకి బాలీవుడ్ నటి మందిరా బేడీని అనుకున్నారు. కానీ ఎక్కడ తేడా కొట్టిందో గానీ రమ్యకృష్ణ సెలక్ట్ అయింది. అప్పటికే సాహో లో మందిరా నటించినా పెద్దగా ప్రయోజనం లేదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."