మెగాస్టార్ చిరంజీవి లైఫ్ స్టైల్…ఎన్ని కోట్ల అస్థి…?
Tollywood Hero chiranjeevi assets :స్వయంకృషితో మెగాస్టార్ ఎదిగిన చిరంజీవి మొదట్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వేసి, అంచెలంచెలుగా తన సత్తా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆచార్య మూవీతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు. 1978లో ప్రాణం ఖరీదు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అసలుపేరు కొణిదెల శివశంకర ప్రసాద్. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు 1955ఆగస్టు 22న పుట్టిన చిరంజీవికి ప్రస్తుతం 66ఏళ్ళు. ఈయనకు చిరు,మెగాస్టార్ అనే పేర్లున్నాయి. ఈయన కు నాగబాబు, పవన్ కళ్యాణ్ అనే బ్రదర్స్, విజయదుర్గ,మాధవిరావు అనే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఒంగోలు సి ఎస్ ఆర్ శర్మ కాలేజీలో , నరసాపురం వై ఎన్ కాలేజీలో చదివిన చిరంజీవి బికాం డిగ్రీ పూర్తిచేశారు.
ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో చిరంజీవి పెళ్లి జరిగింది. వీరికి రామ్ చరణ్ అనే కుమారుడు, శ్రీజ, సుస్మిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి కానిస్టేబుల్ కావడం, చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో చిరంజీవి స్వయం కృషి , పట్టుదలతో ఎదిగారు. స్కూల్ డేస్ లో నాటకాల్లో సరిగ్గా నటించకపోవడం వలన ఫ్రెండ్స్ హేళన చేయడంతో ఇంటికి వెళ్లి అద్దం ముందు నిలబడి మరీ కసిగా నటించేవారు. అదే ఆయన్ని మెగాస్టార్ ని చేసింది. మోసగాడు,రాణికాసుల రంగమ్మ,న్యాయం కావాలి మూవీస్ లో విలన్ గా చేసిన చిరంజీవి 1983లో ఖైదీ మూవీతో స్టార్ హీరోగా ఎదిగారు.
ఇక ఖైదీ నెంబర్ 786,స్వయంకృషి,జగదేకవీరుడు అతిలోక సుందరి,రిక్షావోడు,ఇంద్ర, ఇలా చాలా బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ఆతర్వాత కాంగ్రెస్ పార్టీ లో చేరి,కేంద్రమంత్రిగా పనిచేసి,ఆతర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఖైదీ నెంబర్ 150మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టారు. చిరంజీవికి ఇష్టమైన హీరోలు ఎన్టీఆర్. ఇష్టమైన హీరోయిన్ సావిత్రి. ఇష్టమైన వంటకం ఫిష్ ఫ్రై. హైదరాబాద్, చెన్నై అంటే ఇష్టం. పుస్తకాలు చదవడం,మ్యూజిక్ వినడం ఇష్టం. ప్రాణం ఖరీదు మూవీకి 21వేలు తీసుకున్న చిరంజీవి ఇటీవల సైరా మూవీకి 38కోట్లు అందుకున్నారు. నెట్ వర్త్ 1650కోట్లు ఉంటుంది. జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 25లో విశాలమైన ఇంట్లో ఉండేవారు. ప్రస్తుతం పక్కనే దాదాపు 30కోట్ల విలువైఎన్ విశాలమైన ఇంటికి మారారు. ప్రస్తుతం 6ఖరీదైన కార్లు ఉన్నాయి.

