MoviesTollywood news in telugu

దేవత సీరియల్ నటి సత్య రియల్ లైఫ్…ఎన్ని సినిమాల్లో నటించిందో…?

Devatha serial actress Satya : స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న దేవత సీరియల్ మంచి ప్రేక్షకాదరణతో నడుస్తోంది. ఇందులో నటిస్తున్న నటీనటులు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటిస్తున్న సత్య గురించి వివరాల్లోకి వెళ్తే, ఈమె అసలు పేరు వైష్ణవి. ఈమె డిసెంబర్ 12న జన్మించింది. ఈమెకు ఓ తమ్ముడు, ఓ చెల్లి ఉన్నారు. వీళ్ళు కూడా నటులే. ఇక వైష్ణవి తండ్రి మెడికల్ లో పనిచేస్తుంటే, తల్లి డిజైనర్ గా పనిచేస్తోంది.

వైష్ణవి కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద అంతగా ఆసక్తి లేదు. అయితే తండ్రి కోరిక మేరకు,ఇంటర్ పూర్తయ్యాక ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. జీ తెలుగులో డాన్స్ బేబీ డాన్స్ లో పాల్గొన్న ఈమె అంతకుముందు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసింది. డబ్బింగ్ ఆర్టిస్టుగా చేస్తున్న సమయంలో ఓ కో డైరెక్టర్ ఆమెకు మూవీలో ఛాన్స్ ఇచ్చారు. ఆమెతో పాటు,చెల్లి,తమ్ముడు కూడా నటించారు.

అమెరికా అమ్మాయి,సుందరకాండ,ఇద్దరమ్మాయిలు,పసుపు కుంకుమ,కెరటాలు ఇలా పలు సీరియల్స్ లో నటించింది. ప్రస్తుతం దేవత సీరియల్ లో నటిస్తూ ఎంతోమంది ఆడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకుంది. కాగా సుడిగాడు మూవీలో నటించిన వైష్ణవి తర్వాత మళ్ళీ సినిమాల్లో కన్పించలేదు.ఎందుకంటే మూవీస్ లో నటించడం ఇష్టం లేదట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."