MoviesTollywood news in telugu

ప్రేమ ఎంత మధురం సీరియల్ నీరజ్ లైఫ్ స్టైల్…అసలు నమ్మలేరు

prema entha madhuram serial neeraj : ప్రేమ ఎంత మధురం సీరియల్ బాగా ప్రేక్షకాదరణ పొందుతోంది. ప్రేమకు వయస్సుతో, ఆస్తులు, అంతస్తులతో సంబంధం లేదని చాటి చెబుతూ క్రేజీగా ఈ సీరియల్ నడుస్తోంది. ఇందులో నటించే నటీనటులు తమ అందంతో, నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఇందులో హీరోకి తమ్ముడి క్యారెక్టర్ లో నటిస్తున్న నీరజ్ గురించి వివరాల్లోకి వెళ్తే, ఇతడి అసలు పేరు విజె కరణ్.

ఆగస్టు 12న జన్మించిన కరణ్ కి చిన్నప్పటి నుంచి నటనమీద ఆసక్తి లేకున్నా, యాంకరింగ్ చేయాలన్న కోరిక బలంగా ఉండేదట. జెమినిలో మొదట్లో వచ్చే పకోడీ వార్తలు,కిరాక్ కామెడీ,అన్నా పంచ్ పడుద్ది వంటి షోస్ యాంకరింగ్ చేసి ఆకట్టుకున్నాడు.

సరిగ్గా అదే సమయంలో షార్ట్ ఫిలిమ్స్,వెబ్ సిరీస్ లో నటించాడు. ఆవిధంగా బుల్లితెరపై కూడా నటించాలన్న ఆసక్తి ఏర్పడడంతో జెమినిలో ప్రసారమవుతున్న తాళి సీరియల్ లో అలాగే ప్రేమ ఎంత మధురం సీరియల్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ రెండు సీరియల్స్ మొదటి సీరియల్స్ అయినప్పటికీ తన నటనతో అదరగొడుతున్నాడు