MoviesTollywood news in telugu

2005 లో టాలీవుడ్ ను షేక్ చేసిన త‌మిళ్ డ‌బ్బింగ్ సినిమాలు!

Tamil Dubbing Movies : తమిళం నుంచే కాదు కన్నడ, మలయాళ,హిందీ ఇలా పలు భాషలకు చెందిన మూవీస్ తెలుగులో డబ్బింగ్ అవ్వడమే కాదు అనూహ్య విజయాలను అందుకున్నాయి. అయితే ఒక్క ఏడాదిలోనే పది డబ్బింగ్ సినిమాలు వచ్చి అన్నీ సూపర్ హిట్ కావడం విశేషం. వాటి వివరాల్లోకి వెళ్తే, అందులో ఐదు తమిళ మూవీస్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. 2005ఏప్రియల్ 14న శంకర్ డైరెక్షన్ లో వచ్చిన రజనీకాంత్ నటించిన చంద్రముఖి మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. రజనీకాంత్ చరిష్మా,మంచి కథతో బ్లాక్ బస్టర్ కొట్టింది.14కోట్ల షేర్ తో డబ్బింగ్ మూవీస్ లో బిగ్గెస్ట్ హిట్ అయింది.

ఇక అప్పటికే ఒకే ఒక్కడు,భారతీయుడు,నరసింహ మూవీస్ కూడా టాప్ హిట్స్ గా ఉన్నాయి. ఇక మే 20న శింబు హీరోగా వచ్చిన మన్మధ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఇక జూన్ 17న విడుదలైన అపరిచితుడు సంచలన విజయాన్ని నమోదు చేసింది. శంకర్ డైరెక్షన్ లో విక్రమ్ నటించిన ఈ మూవీ 7కోట్లకు అమ్ముడై, 15కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. శివాజీ మూవీ వచ్చేవరకూ తెలుగులో టాప్ డబ్బింగ్ మూవీగా నిల్చింది. ఉత్తరాంధ్రలో కూడా ఈ మూవీ ప్రభంజనం సృష్టించింది.

ఇక సెప్టెంబర్ లో వచ్చిన గజినీ మూవీ కూడా అనూహ్య విజయాన్ని అందుకుంది. సూర్య హీరోగా,ఏ ఆర్ మురుగుదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ వర్షం కురిపించింది. నిజానికి తెలుగులో వీరికి పెద్దగా పేరు లేకున్నా అందరినోళ్ళలో నానిపోయారు. 12కోట్ల షేర్ కలెక్షన్ తో టాప్ డబ్బింగ్ మూవీస్ లో టాప్ త్రి గా నిల్చింది. ఇక అక్టోబర్ 13న వచ్చిన ప్రేమిస్తే మూవీ ప్రేమకథల్లో ఓ సంచలనంగా నిల్చింది. తెలుగులో ఆలస్యంగా వచ్చినా బ్లాక్ బస్టర్ అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."