క్యారెక్టర్ యాక్టర్ గా సుమన్ నటించిన సినిమాల్లో ఎన్ని హిట్స్…?
Tollywood Actor Suman Movies :ఒకప్పుడు హీరోగా దుమ్మురేపిన సుమన్ తెలుగు,తమిళ,కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసారు. అయితే తెలుగులో హీరో నుంచి సపోర్టింగ్ ఆర్టిస్టుగా అవతారం ఎత్తిన సుమన్ ఎన్నో సినిమాల్లో తన నటనతో అలరించాడు. వాటిల్లో కొన్ని ప్రస్తావిస్తే, కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన మ్యూజికల్ అండ్ కమర్షియల్ హిట్ మూవీ అన్నమయ్య లో శ్రీ వేంకటేశ్వర స్వామి గెటప్ వేసి సుమన్ అదరగొట్టాడు. 1997లో వచ్చిన ఈ మూవీలో టైటిల్ రోల్ లో నాగార్జున అద్భుత నటన కనబర్చగా,సాక్షాత్తు వేంకటేశ్వర స్వామిగా సుమన్ ఒదిగిపోయాడు.కీరవాణి బాణీలు ఇప్పటికీ అందరినోళ్ళలో నానుతుంటాయి.
వైవిఎస్ చౌదరి డైరెక్ట్ చేసిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీలో ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకరిగా పిరికితనంలో డాబుసరితనం చూపించే క్యారెక్టర్ లో సుమన్ నటించి ప్రశంసలు అందుకున్నాడు. పెద్దన్నగా హరికృష్ణ నటించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో 2003లో వచ్చిన అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రిలో తను నమ్మిన యజమాని కోసం ఎంతగా పరితపించి నటించాడో, అలాగే కొడుకుకోసం యజమానిని ఎదిరించి ప్రాణాలు పోగొట్టుకున్న పాత్రను సుమన్ చక్కగా పోషించారు. అలాగే లీలామహల్ సెంటర్ మూవీలో కూడా సుమన్ పూర్తిస్థాయి పాత్రలో సుమన్ అలరించాడు. 2004లో వచ్చిన ఈ మూవీకి దేవీప్రసాద్ డైరెక్షన్ చేసాడు. అతడే ఒక సైన్యం మూవీలో హీరో జగపతి బాబు అన్న పాత్రలో సుమన్ మంచి నటన కనబరిచాడు.
శ్రీరామదాసు మూవీని కూడా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా, శ్రీరామదాసుగా అక్కినేని నాగార్జున తన నటనతో మెప్పించాడు. ఇక శ్రీరాముని పాత్రలో సుమన్ ఒదిగిపోయాడు. 2006లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీకి కూడా కీరవాణి సంగీతం అందించాడు. నీకు నేను నాకు నువ్వు మూవీలో హీరోయిన్ శ్రీకి తండ్రిగా సుమన్ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ ఆకట్టుకుంది. హీరో వేణుకి అన్న పాత్రలో కల్యాణరాముడు మూవీలో సుమన్ నటన అద్భుతం. జి. రామ్ ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రభుదేవా,అంకిత తదితరులు కూడా నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన శివాజీ మూవీలో రజనీ స్టైలిష్ యాక్షన్ఒక ఎత్తైతే,విలన్ గా సుమన్ నటన మరోఎత్తు. శంకర్ డైరెక్షన్ లో 2007లో వచ్చింది. బాలయ్య,బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన లెజెండ్ మూవీలో తక్కువ నిడివి పాత్ర చేసినా సుమన్ తన నటనతో అదరగొట్టాడు.