MoviesTollywood news in telugu

నితిన్ కెరీర్ లో రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయో…!

Tollywood Hero Nithiin Rejected Movies :తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నితిన్ అప్పుడే ఇండస్ట్రీకి వచ్చి 19ఏళ్ళు అవుతోంది. పలు హిట్ మూవీస్ తో పాటు ప్లాప్స్ కూడా చవిచూసిన నితిన్ కరోనా సమయంలోనే పెళ్లి కూడా చేసుకున్నాడు. వినాయక్ డైరెక్షన్ లో దిల్,కృష్ణ వంశి డైరెక్షన్ లో శ్రీ ఆంజనేయం, రాజమౌళి డైరెక్షన్ లో సై ,త్రివిక్రమ్ డైరెక్షన్ లో అ ఆ, పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో హార్ట్ ఎటాక్ వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అయితే 12ప్లాప్ సినిమాలు కూడా చేసాడు. ఇష్క్,గుండెజారి గల్లంతయింది వంటి మూవీస్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. అయితే తన కేరీర్ లో కొన్ని సినిమాలు వదిలేసుకున్నాడు.

ఆర్య మూవీని ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, అల్లరి నరేష్ రిజెక్ట్ చేయగా,నితిన్ కూడా రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లి బ్లాక్ బస్టర్ అయింది. దిల్ మూవీ సమయంలోనే సుకుమార్ ఈ కథ వినిపిస్తే అప్పటికే నాలుగు సినిమాలు కమిట్ అవ్వడంతో డేట్స్ కుదరక చేయలేదు. ధన 51మూవీ సుమంత్ హీరోగా వచ్చింది. సూర్యకిరణ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కథను మొదట్లో నితిన్ కి వినిపించినప్పటికీ ఒకే చెప్పలేదు.

తరుణ్, ఇలియానా జంటగా వచ్చిన భలేదొంగలు మూవీని విజయ భాస్కర్ డైరెక్ట్ చేసాడు. నితిన్ దగ్గరకు ఈ సినిమా వచ్చిన ఒకే చెప్పలేదు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో నాగార్జున ఫ్యామిలీ మొత్తం నటించిన మనం మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అయితే నితిన్ దగ్గరకు ఈ కథ వెళ్లినప్పటికీ అక్కినేని ఫ్యామిలీకి సరిపోతుందని, నాగ చైతన్యకు విక్రమ్ కుమార్ ని నితిన్ పరిచయం చేయడంతో అక్కినేని ఫ్యామిలీతో తీశారు.

పిల్లా నువ్వులేని జీవితం కూడా నితిన్ దగ్గరకు వస్తే ఒకే చేయలేదు. శతమానం భవతి కథ మొదట్లో నితిన్ దగ్గరకు వెళ్లినా ఫైనల్ గా శర్వానంద్ చేసాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీని మొదట్లో నితిన్ తోనే చేయాలని భావించినా, ప్రొడక్షన్ వ్యవహారాల్లో తేడాతో తప్పుకున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు మూవీ నితిన్ దగ్గరకు వెళ్లినా చేయలేదు.

హాలీవుడ్ మూవీ గల్లీ బాయ్ ని రీమేక్ నితిన్ తో చేయాలనీ చూస్తే ఒకే చేయలేదు. మెగా కాంపౌండ్ కి కూడా వెళ్ళింది. అయితే ఇంకా ఎవరూ ఒకే చేయలేదు. ఒరేయ్ బుజ్జిగా కథను మొదట నితిన్ కి చెప్పినప్పటికీ ఒకే చేయలేదు. పవర్ పేట మూవీ కృష్ణ చైత్యన్య డైరెక్షన్ లో చేయాలని నితిన్ భావించినా ఎందుకో పక్కన పెట్టేసాడు.