MoviesTollywood news in telugu

శోభన్ బాబు,కృష్ణం రాజులతో వెంకటేష్ సినిమాలు ఆగిపోవటానికి కారణం…!?

Interesting facts about Victory Venkatesh :మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు వారసుడిగా టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ తక్కువ సమయంలోనే తనకంటూ ఇమేజ్ తెచ్చుకుని విక్టరీ వెంకటేష్ అయ్యాడు. మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ మన్ననలు అందుకున్న వెంకీ దాదాపు 100మూవీస్ చేయగా, విజయం సాధించిన మూవీస్ ఎక్కువ ఉన్నాయి.

పైగా ఒక సినిమాకు మరో సినిమాకు పోలిక ఉండదు. విభిన్న చిత్రాలు చేస్తున్నాడు. ఇతర హీరోలతో కల్సి పనిచేయడానికి ముందుకు రావడంలో దిట్ట. అందుకే మల్టీస్టారర్ మూవీస్ లో చేస్తున్నాడు. అక్కడ పెద్దా చిన్నా తేడా కూడా ఉండదు.సుమన్ తో కొండపల్లి రాజా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,వరుణ్ తేజ్ తో ఎఫ్ 2, నాగ చైతన్యతో వెంకీ మామ ఇలా పలు మల్లీస్టారర్ మూవీస్ లో నటించాడు.

అయితే వెంకీ పుట్టినరోజు నాడు శోభన్ బాబుతో ఓ చిత్రం, రెబెల్ స్టార్ కృష్ణంరాజుతో ఆరంభమైన రెండు సినిమాలు ఆగిపోయాయి. 1991డిసెంబర్ లో వెంకీ పుట్టినరోజునాడు యార్లగడ్డ సురేంద్ర నిర్మాతగా ప్రారంభమైన ఓ మూవీలో వెంకీ, శోభన్ బాబు హీరోలు. పరుచూరి బ్రదర్స్ రచించిన ఈ కథ బావాబావమరుదులకు సంబందించిన కథ. బి గోపాల్ డైరెక్టర్. మ్యూజికల్ గా హిట్ అయ్యేది. ఎందుకంటే బప్పీలహరిని మ్యూజిక్ డైరెక్టర్ గా సెలక్ట్ చేసారు. అదిరిపోయే ట్యూన్స్ ఐదింటిని బప్పీలహరి రెడీ చేయగా, 1992జనవరి 2నుంచి రెగ్యులర్ షూటింగ్. విదేశాల్లో కొంత తీయాలన్న ఈ మూవీ తెలీని అవాంతరాలతో ఆగిపోయింది.

ఇక 1991లోనే వెంకీ నటించే మరో మల్టీస్టారర్ స్టార్ట్ అయింది. రోజా భర్త సెల్వమణి డైరెక్టర్. వెంకీ, మోహన్ బాబులపై ముహూర్తపు షాట్ కి రామానాయుడు స్విచ్ఛాన్ చేయగా, మణిరత్నం సోదరుడు జి వెంకటేశన్ క్లాప్ ఇచ్చారు. విజయశాంతిని హీరోయిన్ గా, మరో కీలక పాత్రకు కృష్ణంరాజుని సెలెక్ట్ చేసారు. వెంకీది పైలట్ ఆఫీసర్ పాత్ర. ఊర్వశి శారద తదితరుల తారాగణంతో ఫ్యామిలీ సెంటిమెంట్ తో కూడిన మూవీ.

జనవరిలో రెగ్యులర్ షూటింగ్ చేయడానికి రంగం సిద్ధం చేసారు. అయితే నిర్మాత నరసారెడ్డి అప్పటికే తమిళంలో హిట్ అయిన చిన రౌండర్ మూవీ హక్కులు కొనడంతో సెల్వమణి మూవీ పక్కన పెట్టి, చినరాయుడు షూటింగ్ బి గోపాల్ డైరెక్షన్ లో స్టార్ట్ చేసారు. ఇందులో విజయశాంతి హీరోయిన్. అయితే ఈ మూవీ ప్లాప్ కావడంతో సెల్వమణి మూవీని నర్సారెడ్డి స్టార్ట్ చేయలేకపోయారు.